నాగార్జున ఆ యాడ్ చేసి తప్పు పని చేసాడా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero nagarjuna
Updated:  2018-07-24 01:14:24

నాగార్జున ఆ యాడ్ చేసి తప్పు పని చేసాడా ?

అక్కినేని నాగార్జున ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క యాడ్స్ తో కూడా బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే చాలా యాడ్స్ చేస్తూ వస్తున్న నాగార్జున కళ్యాణ్ జ్యూవెలరీ కి మాత్రం ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నాడు. ఇటివలే నాగార్జున ముసలివేషంలో కనిపించే ఓ యాడ్ బుల్లితెరపై సందడి చేస్తుంది.  ఈ యాడ్ప్ర ని కళ్యాణ్ జ్యూవెలరీ వారు చేసారు.

ఇప్పుడు ఈ యాడ్ పై బ్యాంకర్స్ అందరూ సీరియస్ గా ఉన్నారు. ఈ యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకాన్ని పెంచేలా ఉంది అని బ్యాంకింగ్ రంగం లో ఉన్న వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తాజాగా ఈ యాడ్ వివాదంపై కళ్యాణ్ జ్యూవెలరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణ్ రామం స్పందిస్తూ, "ఇది కేవలం ప్రచారం కోసమే రూపొందించిన మా కంపెనీ యాడ్, కానీ దీని వల్ల కొంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. మా వ్యాపారంలో కీలకపాత్ర పోషించే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఇబ్బంది పడ్డందుకు మాకు చాలా బాధగా ఉంది. అందుకే వెంటనే ఈ యాడ్ ని బ్యాన్ చేస్తున్నాం" అని చెప్పాడు. హిందీ లో ఇదే యాడ్ ని అమితాబ్ బచ్చన్ చేసాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.