బాలక్రిష్ణ మాటని లెక్క చెయ్యని కళ్యాణ్ రామ్.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

balakrishna and kalyan ram
Updated:  2018-11-05 12:14:45

బాలక్రిష్ణ మాటని లెక్క చెయ్యని కళ్యాణ్ రామ్.

నందమూరి బాలకృష్ణ ఇంకా నందమూరి కళ్యాణ్ ఈ మధ్య నుంచే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ కుటుంబం కలిసి కలవగానే కళ్యాణ్ రామ్ కి ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక అవకాశం ఇచ్చాడు బాలక్రిష్ణ. అలాంటి బాలక్రిష్ణ కళ్యాణ్ రామ్ కి ఒక పని చెయ్యమని అడిగాడు అంట. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం బాలక్రిష్ణ మాటని అస్సలు లెక్కచేయలేదు అంట.

ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ రామ్ ని రాజకీయాల్లోకి రమ్మని, తెలుగుదేశం పార్టీ తరుపున హైదరాబాద్ లో పోటీ చేయమని అడిగాడు అంట బాలయ్య, అయితే ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలనే ఆశ లేదని బాలయ్య బాబాయ్ ఇచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేసాడు కళ్యాణ్ రామ్. నందమూరి కళ్యాణ్ రామ్ ఒకవైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు హీరోగా నటిస్తున్నాడు.

అయితే సినిమా రంగంలో ఓ స్టార్ హీరోగా వెలుగొందాలని ఆశించాడు కానీ ఆ ఆశ నెరవేరలేదు. మరో పదేళ్ల పాటు సినిమాలు చేస్తానని, ఆ తర్వాతే రాజకీయాల గురించి ఆలోచిస్తానని చెప్పాడట బాలయ్యకి. కానీ తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం అసలు కళ్యాణ్ రామ్ కి బాలక్రిష్ణ అంటే లెక్క లేదా అంత పెద్ద ఆఫర్ ని ఎలా రిజెక్ట్ చేస్తాడు అంటూ కళ్యాణ్ రామ్ పై సీరియస్ అవుతున్నారు అంట. 

షేర్ :

Comments

0 Comment