కళ్యాణ్ రామ్ ని "ఎన్టీఆర్" సినిమా నుంచి తీసేశారా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ntr bio pic
Updated:  2018-08-17 04:38:51

కళ్యాణ్ రామ్ ని "ఎన్టీఆర్" సినిమా నుంచి తీసేశారా..?

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా "ఎన్టీఆర్". సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రస్తుతం అబిడ్స్ లోని ఎన్టీఆర్ ఇంట్లో జరుగుతుంది. ఎన్టీఆర్ మద్రాస్ నుంచి హైదరబాద్ కి వచ్చాక అబిడ్స్ లో ఉండేవాడు.
 
అందుకే ఇప్పుడు అక్కడ బాలకృష్ణ, రానా, విద్యాబాలన్ మధ్యలో కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు అంట మూవీ యూనిట్. అసలైతే ఈ షెడ్యూల్ లో నందమూరి కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రని పోషించాలి, కానీ అనుకోని విధంగా కళ్యాణ్ రామ్ ఈ షెడ్యూల్ లో పాల్గోనట్లేదు. ఇదిలా ఉంటె ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కి అలాగే హరికృష్ణ ఫ్యామిలీ కి పడట్లేదు.
 
అందుకే ఈ సినిమాలో నుంచి కళ్యాణ్ రామ్ ని తీసేశారు అనే వార్త ఫిలిం నగర్ లో హలచల్ చేస్తుంది. కానీ అసలు హరికృష్ణ పాత్రని ఎవరు పోషిస్తారు అనే న్యూస్ అధికారికంగా ప్రకటించలేదు నిర్మాతలు. వారాహి చలని చిత్రం పై సాయి కొర్రపాటి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

షేర్ :