మీ టు ఉద్యమం పై షాకింగ్ కామెంట్స్ చేసిన కమల్ హసన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kamal hasan
Updated:  2018-10-13 01:14:35

మీ టు ఉద్యమం పై షాకింగ్ కామెంట్స్ చేసిన కమల్ హసన్

ఇప్పుడు ఎక్కడ చూసిన ఎవరి నోట చూసిన మీ టు గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక టాలీవుడ్, కోలీవుడ్ సింగర్ చిన్మయి మీటూ ఉద్యమానికి ఆద్యం పోసి తన సొంత భుజాలపై తిసుకేలుతుంది. చిన్మయి, రచయిత వైరా ముత్తుల వివాదం ఇప్పుడు తమిళ పరిశ్రమలో సంచలనంగా మారింది.

స్విట్జర్లాండ్ లో జరిగిన ఓ కార్యక్రమం తర్వాత వైరాముత్తు తనను గదికి వచ్చి కోపరేట్ చేయాలనీ కోరాడంటూ ఇటీవల చిన్మయి ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసింది. తాజాగా ఈ వివాదంపై నటుడు కమల్ హాసన్ స్పందిస్తూ చిన్మయి, వైరాముత్తుల పేర్లు ప్రస్తావించకుండా మీటూ ఉద్యమంపై తన అభిప్రాయాన్ని చెప్పాడు.

ఈ వివాదంపై ఉద్యమం చేస్తున్న బాధితురాలు బయటకు వచ్చి మాట్లాడాలి, లేకపోతే ఈ ఉద్యమం ముందుకి అస్సలు సాగదు.అసలు ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు సైతం దీనిపై మాట్లాడుతున్నారు. వారి వల్ల ఇది తప్పు దారి పట్టే అవకాశాలు ఉన్నాయి. దీని బదులు ఏదైనా ఆధారాలు ఉంటే బాధితురాలు లీగల్ గా దీని పై స్పందించాలి అంతే గాని దీన్ని ఇంకా సాగదీయడం అంత మంచిది కాదు అంటూ కమల్ హసన్ చెప్పు కొచ్చాడు. 

 

షేర్ :

Comments

0 Comment