రోబో కి రెండు సార్లు నో చెప్పిన కమల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kamal hasan
Updated:  2018-11-02 05:20:28

రోబో కి రెండు సార్లు నో చెప్పిన కమల్

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులలో శంకర్ ఒకడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అతని కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయం తో తెరకెక్కి, అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం రోబో అయితే ఈ చిత్రం లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో అన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రాన్ని మొదట లోకనాయకుడు కమల్ హసన్ తో అనుకున్నారట. కొన్ని స్టిల్ ఫొటోస్ కూడా రిలీజ్ చేసిన తరువాత కొన్ని అనివార్య కారణాల కారణంగా సినిమా మొదలు కాలేదు. అయితే ఆ తరువాత ఇదే కథని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కి చెప్పాడట.ఇక చివరిగా రజినీకాంత్ తో తీసాడు శంకర్. దీనికి సిక్వల్ గా ఇప్పుడు 2.ఓ రాబోతుంది. ఈ చిత్రం కోసం కొన్ని విశేషాలు తెలియజేస్తూ 2.ఓ లో విలన్ గా హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ అనుకుని ఆయన నో చెప్పడంతో కమల్ ని సంప్రదించడట శంకర్.

చాలా ఏళ్ళ తరువాత కమల్-రజిని లని ఒకే స్క్రీన్ మీద చూపించాలనే కోరిక తో, అయితే కమల్ దీనికి కూడా నో చెప్పడం తో రోబో కి రెండుసార్లు నో చెప్పినట్టయింది. ఎందుకంటే కారణం కూడా ఈ సందర్భంగా తెలియజేశాడు శంకర్. అప్పుడు ఆయన విశ్వరూపం సినిమా తో బిజీగా ఉండడంతో, అదికాకుండా కమల్ కి భారతీయుడు-2పై ఎక్కువ మక్కువ ఉన్నట్టు చెప్పాడు. ఇక ఈ విలన్ పాత్ర అక్షయ్ కుమార్ చేస్తున్న సంగతి తెలిసిందే.

షేర్ :