ఇబ్బందులు పడుతున్న కమల్ హసన్.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-03 05:56:02

ఇబ్బందులు పడుతున్న కమల్ హసన్.

"విశ్వరూపం"....ఈ సినిమా 2013 లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే "విశ్వరూపం 2" ని స్టార్ట్ చేసాడు కమల్ హసన్. ఈ సినిమాని మొదట్లో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించాడు, కాని లాస్ట్ మినిట్ లో బడ్జెట్ ఎక్కువ అవ్వడం మూలాన ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.
 
ఇక అప్పటి నుంచి మూవీ కి అయ్యే ఖర్చు మొత్తం కమల్ హసనే పెట్టుకున్నాడు. తనే తన సొంత డబ్బులు పెట్టి మరి మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని చేయించాడు. ఇక ఫైనల్ గా అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని ఈ సినిమా ఆగష్టు 10 న రిలీజ్ అవుతుంది అని అందరు అనుకుంటుండగానే ఇప్పుడు మరో ఇబ్బంది ఎదురయ్యింది.
 
అదేంటంటే ఈ సినిమాని ఇప్పటి వరకు ఎవరు కొనలేదు అంట. ఇక ఈ సినిమాకి బిజినెస్ అవ్వట్లేదు అని తెలిసి కమల్ హసనే స్వయంగా వచ్చి హైదరబాద్ లో ప్రమోషన్స్ అన్ని చూసుకుంటున్నాడు. మరి ఇప్పుడు అయిన ఈ సినిమాకి బిజినెస్ అవుతుందో లేదో చూడాలి.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.