నన్ను గట్టిగా వాటేసుకొని కోరిక తీర్చుకునేవాడు ఆ డైరెక్ట‌ర్‌.. కంగనా రనౌత్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kangana ranaut
Updated:  2018-10-08 04:57:22

నన్ను గట్టిగా వాటేసుకొని కోరిక తీర్చుకునేవాడు ఆ డైరెక్ట‌ర్‌.. కంగనా రనౌత్

మీ టూ ఉద్యమం ఇండియా లో జోరుగానే ఊపందుకుంటుంది.. మొన్న ఆ మధ్య నటి కాజోల్, సింగర్ చిన్మయి తమపై జరిగిన లైంగిక వేధింపులు కోసం పబ్లిక్ గా ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు.. ఇప్పుడు కంగనా రనౌత్...ఇంతకీ ఈ హాట్ బ్యూటీ బైట పెట్టింది ఒక దర్శకుడి పేరు.. ఆ దర్శకుడు తనని గట్టిగా కౌగిలించుకొని చేతులు ఎక్కడో వేసి నలిపేవాడని అలాగే ఎక్కువసేపు కౌగిలించుకుంటూ శునకానందం పొందేవాడని సంచలన ఆరోపణలు చేస్తోంది వివాదాస్పద హీరోయిన్..

ఆ దర్శకుడు మరెవరో కాదు.. కంగనా తో క్వీన్ అనే సినిమా తీసిన దర్శకుడు వికాస్ బాల్. అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో నేను తొందరగా పడుకునే దాన్ని దాంతో నాపై సెటైర్ లు వేసేవాడని, నేను అతడికి చిక్కలేదని అందుకే కలిసినప్పుడు నన్ను గట్టిగా వాటేసుకొని కోరిక తీర్చుకునే వాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఇన్నాళ్లు బైట పెట్టకుండా ఇప్పుడెందుకు చెప్పారు అన్నందుకు మీ టు అనే ఉద్యమం సాగుతోంది కాబట్టి అనే సమాధానం ఇచ్చింది. అంతేకాదు వికాస్ బాల్ కు పెళ్ళి అయినప్పటికీ ప్రతీరోజు కొత్త మహిళటో శృంగారం చేయాలనీ పరితపించే వాడని, అలా చాలామంది ని వాడుకున్నాడని అంటోంది.

అలాగే క్వీన్ సినిమా తర్వాత నాతో మరో సినిమా చేయాలని కామంతోనే నా దగ్గరకు వచ్చాడని, ఆ విషయం నాకు తెలిసి అతడ్ని దూరం పెట్టానని దాంతో మళ్ళీ అతడు నా జోలికి రాలేదని అంటోంది కంగనా రనౌత్.. అయితే ఈ వ్యాఖ్యల పై దర్శకుడు వికాస్ నుండి ఎటువంటి సమాధానం కానీ, ఖండించిన దాఖలాలు కానీ లేవు.. ఆయన మౌనం ఈ వార్తల్ని బలపరుస్తున్నాయి అని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.. అంతేకాకుండా మరికొంతమంది బైటకొచ్చి ఈ విధంగా ఆరోపణలు చేసే అవకాశం లేకపోలేదు..

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.