మీరు వాళ్ళ పక్కలో కెళ్ళినప్పుడు మీటూ ఏమైంది..? కన్నడ హీరోయిన్ హర్షిక పూనాచా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

harshika poonacha
Updated:  2018-10-24 04:24:53

మీరు వాళ్ళ పక్కలో కెళ్ళినప్పుడు మీటూ ఏమైంది..? కన్నడ హీరోయిన్ హర్షిక పూనాచా

మీటూ ఎక్కడో ఇతర దేశాల్లో మొదలై, భారతీయ చిత్ర పరిశ్రమలో దూమరం రేపుతున్న ఉద్యమం.కానీ ఆడవారు మన భారతదేశంలో అలా మీడియా ముందుకు వచ్చి లైంగిక వేధింపులు కోసం మాట్లాడడం కొంచెం ఇబ్బందికరమైన విషయం అయినప్పటికీ, గట్టిగానే ఊపందుకుంటుంది. కారణం అయిన వాళ్ళ పేర్లు చెప్పడం సులభమే కానీ, అవి ఆధారాలతో నిరూపించడమే సాహసంతో కూడుకున్న పని, కొన్నిసార్లు రుజువు కూడా చెయ్యలేని పరిస్థితి.ఇప్పుడు ఎవరి మీద ఆరోపణలు వస్తే వారిని నేరస్తులుగా దాదాపు అందరూ ఫిక్స్ అవుతున్నారు.

90శాతం మంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు. కానీ కన్నడ హీరోయిన్ హర్షిక పూనాచా తన ట్విట్టర్ వేదికగా మీటూ పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తమ కెరీర్ మొదట్లో డబ్బు.. అవకాశాలు.. హైఫై లైఫ్ కోసం అన్నిటిలో కాంప్రమైజ్ అయ్యి వారి చుట్టూ ఉన్న మగాళ్ళకు పూర్తి ఫ్రీడం ఇచ్చారు.. ఇప్పుడు మాత్రం పబ్లిసిటీ కోసం.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిపై ఆరోపణలు చేస్తున్నారు. మీరు వాళ్ళ పక్కలోకెళ్ళినప్పుడు మీటూ ఏమైంది..? అని ప్రశ్నించింది.చాలారోజులనుండి నేను మీటూ గురించి  మాట్లాడాలా వద్దా అని అలోచిస్తూ ఉన్నా. కానీ మనకు అన్నం పెట్టిన పరిశ్రమ ను ఇలా చేస్తున్నారేంటి అనే ఆలోచనతో నేను మాట్లాడాల్సి వస్తోంది.

పబ్లిసిటీ కోసం మీటూ లో పలుపంచుకోవద్దు అని ఈ సందర్భంగా చెప్పింది.రియల్.అంతే కాదు.  మగాళ్ళు వుయ్ టూ కాంపెయిన్ మొదలు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళను వాడుకున్న హీరోయిన్లు నాకు చాలామంది తెలుసు అని మగమహారాజులకి సలహా ఇచ్చింది ఈ అమ్మడు.

షేర్ :

Comments

0 Comment