తెలుగునాట కన్నడ భామల జోరు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-09-24 12:40:41

తెలుగునాట కన్నడ భామల జోరు

సినీ పరిశ్రమ మొత్తం సెంటిమెట్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తూ ఉంటుంది. ఒక్కోసారి చాలా మంచి నటన, ప్రతిభ కలిగిన నటులు అవకాశాలు లేక రోడ్డున పడితే, నటనలో  అ ఆ లు కూడా తెలియని నటీనటులు అవకాశాలతో అందలం ఎక్కుతూ ఉంటారు. కానీ ఈమధ్య ఈ ట్రెండ్ మారింది.  టాలెంట్ ఉండి మంచి స్క్రీన్ ప్రెజన్స్ ఉంటె అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి.

దీనికి ఉదాహరణ చాలా మందే ఉన్నారులెండి. మాములుగా మన తెలుగు దర్శక నిర్మాతలు హీరోయిన్ కావాల్సి వచ్చినప్పుడు ముంబై పయనమై అక్కడి ముద్దుగుమ్మలు ఇక్కడికి పట్టుకొస్తూ ఉంటారు. కానీ మన దక్షిణాది అమ్మాయిలు కూడా ఈ మధ్య బాగానే రాణిస్తున్నారు. ముఖ్యంగా మలయాళీ భామలు, కన్నడ ముద్దుగుమ్మలు మన తెలుగునాట రాజ్యం ఏలుతున్నారు. ‘ఛలో‘, ‘గీత గోవిందం’ తో తనది గోల్డెన్ లెగ్ అని ఇప్పటికే నిరూపించుకుని వరుస అవకాశాలతో దూసుకుపోతుంది రష్మిక మందన. ఇప్పుడు మరో కన్నడ భామ టాక్ అఫ్ ది టాలీవుడ్ అయ్యింది.

ఆమె ఎవరో కాదు సుధీర్ బాబు నిర్మాతగా మారి, యువ దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు తో నిర్మిచిన చిత్రం “నన్ను దోచుకుందువటే” లో నటించిన నాభ నటేష్. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్, అందం అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కొత్తమ్మాయిలా కాకుండా చాలా కాన్ఫిడెంట్‌గా నటించి మార్కులు కొట్టేసింది నభా. ఇక సినిమాకు మంచి టాక్ రావడం, నభాకూ పేరు రావడంతో వెంటనే ఆమె కోసం దర్శక నిర్మాతలు ఈమె కోసం లైన్లు కట్టేశారంట. ఆల్రెడీ రవితేజ-వీఐ ఆనంద్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు నభాను కథానాయికగా ఎంపిక చేసేసినట్లు సమాచారం. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.