విజయ్ దేవరకొండ ని మరిపిస్తున్న కార్తికేయ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero karthikeya
Updated:  2018-08-06 03:29:46

విజయ్ దేవరకొండ ని మరిపిస్తున్న కార్తికేయ

చిన్న సినిమాగా మొదలై పెద్ద విజయం అందుకున్న చిత్రం "ఆర్ ఎక్స్ 100". నూతన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా తెరకెక్కిన ఈచిత్రం  ఇటీవలే విడుదలై సంచలన విజయం నమోదు చేసుకుంది.
 
ముఖ్యంగా ఈ చిత్ర హీరోయిన్ పాయల్ రాజపుత్ కి ఇప్పుడు మంచి క్రేజ్ నెలకొంది, రాబోయే రోజుల్లో మంచి ఆఫర్స్ తో ఈ భామ సందడి చేయబోతోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక తన మొదటి సినిమాలోనే మంచి నటన కనబరిచిన  చిత్ర హీరో కార్తికేయకు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయట, అయితే ఈ కుర్రాడు తెలుగు ఆఫర్ ని పక్కన పెట్టి ఒక తమిళ సినిమాకు ఒకే చెప్పినట్లు సమాచారం.
 
వెంకటేష్ తో "ఘర్షణ"  రజని తో "కబాలి", విక్రమ్ తో "మల్లన్న" , విజయ్ తో "తేరి" వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకం ఫై కలై పులి ఎస్ తాను ఈచిత్రాన్ని నిర్మించబోయే ఈ చిత్రానికి టి.ఎన్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడట. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. కార్తికేయ సినిమాల సెలక్షన్ చూస్తుంటే అందరికి విజయ్ దేవరకొండ ఏ గుర్తొస్తున్నాడు. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.