ప‌వ‌న్ పై మ‌రోసారి క‌త్తి నూరాడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-15 06:57:42

ప‌వ‌న్ పై మ‌రోసారి క‌త్తి నూరాడు

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఆయ‌న అభిమానుల‌పై సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ త‌న దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే... ఈ వివాదాలు స్థాయికి మించి పోవ‌డంతో ప‌వ‌న్ అభిమానులు ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ సాక్షిగా క‌త్తి మ‌హేష్ తో కాంప్ర‌మైజ్ అయ్యారు... దీంతో క‌త్తి మ‌హేష్ త‌న సోష‌ల్ మీడియాకు గ‌త కొద్ది కాలంగా ప‌వ‌న్ పై ఆయ‌న అభిమానుల‌పై విమ‌ర్శ‌లకు పుల్ స్టాప్ పెట్టారు.  
 
దీంతో ఈ యుద్దం ముగిసిపోయింద‌న్న స‌మ‌యంలో మ‌రోసారి క‌త్తి మ‌హేష్ త‌న సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని మ‌రో సారి ప‌వ‌న్ పై త‌న దైన శైలిలో విమ‌ర్శ‌లు చేశారు... రాజ‌కీయ ప‌రంగా ప‌వ‌న్ ను న‌మ్మే ముందు మొద‌ట‌గా చిరంజీవి కాపు కులానికి ఏ మాత్రం న్యాయం చేశార‌నేది మీ త‌ల్లిదండ్రుల‌ను అడిగి తెలుసుకోండ‌ని, మీరు అస‌లైన లీడ‌ర్ ముద్ర‌గ‌డ‌ను మ‌రిచి వీళ్ల‌ను ప‌ట్టుకున్నార‌ని ప‌వ‌న్ అభిమానుల‌ను విమ‌ర్శిస్తూ క‌త్తి ట్వీట్ చేశారు...
 
మ‌రో ట్వీట్ లో క‌త్తి పోస్ట్ చేస్తూ... టీడీపీ బీజేపీకి నువ్వు స‌పోర్టు... ఇప్పుడు మాత్రం నీకు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వామ‌ప‌క్షాల‌ సపోర్టు కావాలి... ఏమయ్యా పవన్ కల్యాణ్.. అంతేనా అని కత్తి మహేష్ విమ‌ర్శించారు... మ‌రి ఈ ట్వీట్ పై ప‌వ‌న్ అభిమానులు, కాపు కుల‌స్తులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.