కత్తి మహేష్ మళ్ళీ మొదటికొచ్చాడుగా..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kathi mahesh
Updated:  2018-09-04 06:30:35

కత్తి మహేష్ మళ్ళీ మొదటికొచ్చాడుగా..

మొన్నామధ్య శ్రీరాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన కత్తి మహేష్ తాజాగా తన మకాం విజయవాడ కు మార్చాడు. ఇకపై తాను విజయవాడలో నే ఉండబోతున్నట్టు మీడియా కు తను ప్రకటించుకున్నాడు.అప్పట్లో ఒకసారి రాజకీయాల్లోకి వస్తున్నా ఒక ప్రముఖ రాజకీయ పార్టీ ద్వారా రాయలసీమ లో ఎంపీ టికెట్ ఆశిస్తున్నా అని ఊహాగానాలు వినిపించిన సంగతి విదితమే.
 
తన రాజకీయ రంగప్రవేశం గురించి తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడిన మహేష్ త్వరలోనే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. తన వ్యక్తిగత స్వేచ్చని నగర బహిష్కరణ ద్వారా హరించారు పరోక్షంగా తెలంగాణ మీద విరుచుకు పడ్డారు. దానివల్ల తాను ఉపాధి కొల్పాయనని వాపోయారు. తాను చేసిన వ్యాఖ్యలు చట్టానికి వ్యతిరేఖం కాదని ఆయన గుర్తు చేశారు. తాను చేసింది నేరం అయితే న్యాయస్థానాలు ఊరుకుంటాయా అని ఆయన ప్రశ్నించారు.
 
ప్రాథమిక హక్కులను నగర బహిస్కరణ తో కాలరాశారు అని ఆయన అన్నారు. తనివి విమర్శలు మాత్రమేనని వీలైతే వాతితో ఏకీభవించాలని లేదంటే వ్యతిరేఖించాలని అంతే కాని తనను ఇలా హింసించడం తగదని ఆయన పేర్కొన్నారు. హత్యలు చెయ్యమని, గొడవలకు వెళ్ళమని ప్రేరేపించినవారిని వదిలేసి అభిప్రాయం వ్యక్తం చేసినవారిని హింసించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.. ఇష్టానుసారంగా గోవధ పేరుతో మనుషులను చంపుతున్నా పట్టించుకుపోకుండా తనను టార్గెట్ చెయ్యడం ఏంటని ఆయన అన్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.