బావ బామ్మ‌ర్ది అంటూ ప‌వ‌న్ పై ట్వీట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kathi mahesh tweet on pawan
Updated:  2018-04-09 12:56:25

బావ బామ్మ‌ర్ది అంటూ ప‌వ‌న్ పై ట్వీట్

సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్  త‌న పొలిటిక‌ల్ స‌టైర్ల‌తో దూసుకుపోతున్నాడు..ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన శ్రీరెడ్డిని, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని పోలుస్తూ కత్తి మహేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం అయింది. ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌ను అని అభిమానుల‌కు చెప్పాడు... అయినా ఆ గీత దాటుతున్నాడు క్రిటిక్ క‌త్తి మ‌హేష్.. ఇక ఎటువంటి సినీ పొలిటిక‌ల్ డిబేట్ జ‌రిగినా అక్క‌డ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ ఉంటున్నాడు సో క‌త్తికి మ‌రింత ప‌దును ఇటీవ‌ల పెరిగింది అనే చెప్పాలి.
 
బావా అంటూ కత్తిని ఒకరు ప్రశ్నించడం.. బామ్మర్ది అంటూ కత్తి మహేష్ సమాధానం ఇస్తున్నట్లుగా కత్తి మహేష్ ఈ మధ్య ట్వీట్స్ చేస్తుండటం  మ‌న‌కు తెలిసిందే...... అదే తరహాలో ఇక్కడ బామ్మర్ది అనే అతను "బావా! ప్రాణం పోయినా ఇచ్చినమాట. చెప్పిన మాట నిలబెట్టుకునేవాళ్ళని ఏమంటారు? నిలబెట్టుకోనివాళ్ళని ఏం అంటారు?" అని ప్రశ్నిస్తే.. ఒకరిని శ్రీరెడ్డి అంటారు. మరొకరిని పవన్ కల్యాణ్ అంటారు బామ్మర్ది అంటూ సమాధానం ఇచ్చాడు. 
 
ఇప్పుడు ఈట్వీట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది... అయితే ఈ ట్వీట్ల ప‌ర్వం ఇక క‌త్తి ఆప‌డు అని ఇటు ప‌వ‌న్ పై పొలిటిక‌ల్ స‌టైర్ల‌తోనే క‌త్తి మ‌హేష్ మ‌రింత పాపులర్ అవుతున్నాడు అని అంటున్నారు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.