చిరుపై కూడా క‌త్తి నూరాడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kathi mahesh chiranjeevi
Updated:  2018-04-02 05:39:41

చిరుపై కూడా క‌త్తి నూరాడు

కొద్ది నెల‌లుగా  సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఆయ‌న‌ అభిమానుల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే..అయితే ఈ విమ‌ర్శ‌లు ఎక్క‌డిదాక దారి తీస్తాయో అన్న‌ ఉద్దేశ్యంతో జ‌న‌సేన అధినేత సూచ‌న‌ల మేర‌కు అభిమానులు, క‌త్తి మ‌హేష్ ను క‌లిసి ఓ ప్ర‌ముఖ మీడియా స‌మ‌క్షంలో ఒక్క‌ట‌య్యారు.
 
వీరిరువురు కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం క‌త్తిమ‌హేష్ ప‌వ‌న్ అభిమానుల‌ను విమ‌ర్శిస్తూ ఎటువంటి పోస్ట్ లు పెట్ట‌లేదు... అప్పుడ‌ప్పుడు  ప‌వ‌న్ ను ఆయ‌న అభిమానుల‌పై క‌త్తి  పరోక్షంగా ట్వీట్ చేసినా కానీ అత‌నిపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌లేదు ప‌వ‌న్ ఫ్యాన్స్.. ప‌వ‌న్ అభిమానులు స‌రిగ్గా రిప్లై  ఇవ్వ‌క‌పోవ‌డంతో యూట‌ర్న్ తీసుకుని ఇందులో చిరంజీవిని కుడా యాడ్ చేసుకున్నారు క‌త్తి మ‌హేష్ ..  ఇక తాజాగా క‌త్తి చిరంజీవిని  తీవ్ర స్థాయిలో విమ‌ర్శిస్తూ ట్వీట్ చేశారు. మెగా బ్రదర్స్ గురించి ఆయన చెప్పిన ఉదాహరణ ఇదే
 
ఒక ఊరిలో ఒక వెధవ.బ్రతికుండగా,ఆడోళ్ళని నానా హింసలూ పెట్టేవాడు.చచ్చేముందు కొడుకుతో,బ్రతకడం ఇలా బతికేసాను.చచ్చాకైనా నాకు మంచిపేరు తీసుకురా అన్నాడట. దీంతో కొడుకు తండ్రికన్నా దారుణాలు చేసి, "వీడికన్నా వీడి తండ్రే బెటర్ అనిపించాడట. !!ఇప్పుడు చిరంజీవిని చూస్తే, బెటర్ అనిపించదూ మరీ!! అంటూ క‌త్తి మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.... ఇక ఈ ట్వీట్ ను చూసిన మెగా స్టార్ అభిమానులు ఆగ్ర‌హాంతో ఉన్నారు. క‌త్తి మ‌ళ్లీ మెగా ఫ్యామిలీ జోలికి వ‌స్తున్నాడు అని మంట‌మీద ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.