తొలిప్రేమ సినిమా పై మ‌హేష్ క‌త్తి నూరాడుగా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-12 12:25:03

తొలిప్రేమ సినిమా పై మ‌హేష్ క‌త్తి నూరాడుగా

బిగ్ బాస్ షో తో తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌య‌మయ్యారు సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్... ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని గ‌త నాలుగు నెల‌లుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఆయ‌న అభిమానుల‌పై తన‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ  వార్త‌ల‌లో నిలుస్తున్నారు క‌త్తి మ‌హేష్...  కాగా కొద్ది రోజులు క్రితం ఓ మీడియా ఛాన‌ల్ వేదిక‌గా వీరిరువురు ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే.
 
ఇటీవ‌లే కొంత కాలంగా క‌త్తి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్టులు పెట్ట‌కపోవ‌డంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ ప‌డింద‌నుకున్నారు ప‌వ‌న్ అభిమానులు... అయితే ఈసారి ప‌వ‌న్ ను విమ‌ర్శంచ‌కుండా మోగా ఫ్యామిలీపై ఫోక‌స్ చేశాడు క‌త్తి మ‌హేష్.. కేంద్రం ప్ర‌క‌టించిన  బ‌డ్జెట్ లో ఏపీకి అన్యాయం జ‌రిగిందంటూ ఏంపీలు పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల‌లో నిర‌స‌న‌లు చేస్తుంటే, ఆ నిర‌స‌న‌లో కొణిదెల చిరంజీవి జాడ లేదంటూ క‌త్తి మ‌హేష్ ట్విట్ చేయ‌డంతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు..  
 
అయితే  తాజాగా ఫిదా హిట్ తర్వాత వరుణ్ తేజ్ నటించిన మరో చిత్రం తొలిప్రేమ... ఈ సినిమా  బాక్సాఫీస్ వ‌ద్ద అభిమానులను అల‌రిస్తోన్న నేప‌థ్యంలో క‌త్తి మ‌హేష్ మ‌రోసారి త‌న సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని తొలిప్రేమ సినిమాపై రివ్యూ ఇచ్చారు.. తెలుగులో ఇప్పట్లో వచ్చిన మంచి ప్రేమకథా చిత్రాల్లో తొలిప్రేమ ఒకటి అని,   హీరో, హీరోయిన్లు, ఇతర నటులు ఆకట్టుకునే విధంగా నటించారని క‌త్తి పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.