క‌త్తికి పదును పెట్టిన మ‌హేష్ ఈసారి ఏకంగా ఇడియ‌ట్స్ అంటూ...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kathi mahesh
Updated:  2018-09-24 02:20:53

క‌త్తికి పదును పెట్టిన మ‌హేష్ ఈసారి ఏకంగా ఇడియ‌ట్స్ అంటూ...

సినిక్రిటిక్ క‌త్తిమ‌హేష్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. బ‌హుశా స్టార్ హీరోలు కూడా క‌త్తి మ‌హేష్ ఫేమ‌స్ అయిన తొంద‌ర‌గా ఫేమ‌స్ అయిఉండ‌ర‌ని కొంత‌మంది వాద‌న‌. ఏది ఏమైన‌ప్ప‌టికి క‌త్తి మ‌హేష్ మ‌రోసారి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ అభిమానుల‌కు క‌త్తిమ‌హేష్ వివాదానికి ప‌రిష్కారం దొర‌క‌క‌ముందే మ‌రో వివాదంలో త‌ల‌దూర్చాడు క‌త్తి మ‌హేష్.. దీంతో మ‌రోసారి సంచ‌ల‌నంగా మారాడు.
 
ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న టాలీవుడ్ బిగ్ బాస్ సీజ‌న్ -2 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హౌస్ లో కౌశ‌ల్, త‌నీష్, దీప్తి, గీతామాధురి, సామ్రాట్ ఉన్నారు. వీరిలో కౌశ‌ల్ టైటిల్ గెలుచుకుంటాడ‌నే వేళ‌, క‌త్తి మ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొద్దిరోజుల క్రితం హౌస్ లో జ‌రిగిన వివాదాల‌ను ప్ర‌స్తావిస్తూ ట్వీట్ చేశారు క‌త్తి. కౌశ‌ల్ అంతా కోల్పోయాడ‌ని అత‌న్ని హౌస్ నుంచి బ‌య‌ట‌కు గెంటేయండి అని ట్వీట్ చేశాడు.
 
నాని, కౌశ‌ల్ ను ప్ర‌శ్నించిన వేళ విసుగుప‌డుతూ స‌మాధానం చెప్పాడ‌ని బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే ఇది చాలా చిరాకు తెప్పించిన వ్య‌క్తి కౌశ‌ల్ అని ట్వీట్ చేశారు. కౌశ‌ల్ ను బిగ్ బాస్-2 విన్న‌ర్ గా ప్ర‌క‌టిస్తే మ‌న‌మెంత ఇడియ‌ట్స్ అనేది ప్రూవ్ అవుతుంద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు విన్న‌ర్ గా దీప్తీ న‌ల్ల‌మోతుల‌ను ప్రక‌టించాల‌నే ప్ర‌చారం చేస్తాన‌ని క‌త్తి మ‌హేష్ ట్వీట్ చేశారు. ఇక క‌త్తి ట్వీట్ పై నెటిజ‌న్లు, ప‌వ‌న్ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.