క‌త్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-04-11 18:40:29

క‌త్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్.. బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచ‌య‌మై ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై అత‌ని అభిమానుల‌ను త‌న‌దైన శైలిలో విమ‌ర్శలు చేసి వార్త‌ల్లో  సంచ‌ల‌నంగా నిలిచారు.. సుమారు నాలుగు నెల‌ల‌పాటు కొన‌సాగిన ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డిదాక దారి తీస్తుందోన‌ని భావించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ,అత‌ని ఆదేశాల‌మేర‌కు ఓ ఆస్తాన మీడియా స‌మ‌క్షంలో ప‌వ‌న్ అభిమానులు, క‌త్తి మ‌హేష్ ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే.
 
అయితే వారు కుదుర్చుకున్న‌ ఒప్ప‌దం ప్ర‌కారం  క‌త్తి మ‌హేష్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో ఎలాంటి పోస్ట్ లు పెట్ట‌లేదు... అప్పుడ‌ప్పుడు పేరు ప్ర‌స్తావించ‌కుండా ప‌వ‌న్ అభిమానులను విమ‌ర్శిస్తున్నా కానీ అధినేత కోరిక మేర‌కు క‌త్తి మ‌హేష్ పెట్టిన పోస్ట్ ల విమ‌ర్శిస్తూ అభిమానులు ఎలాంటి పోస్ట్ లు పెట్ట‌లేదు.. దీంతో ప‌వ‌న్ అభిమానులుపై ట్వీట్ చేయ‌కుండా రాజ‌కీయ నియ‌కుల‌పై ట్వీట్ చేస్తూ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారుతున్నారు క‌త్తి..
 
ఇక తాజాగా అనంత‌పురంలో ఏర్పాటుచేసిన‌ బ‌హిరంగ స‌భ‌లో క‌త్తి మాట్లాడారు... ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మ‌న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ పెద్దనోట్ల రద్దు ఫలాల్ని 50 రోజుల్లో ప్రజలందరికి అందకపోతే తనను కాల్చేయాలని సాక్షాత్తు మోడీనే తెలిపార‌ని క‌త్తి గుర్తు చేశారు.. నోట్ల ర‌ద్దు చేసి సుమారు రెండు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా దానిపై మోదీ  ప్ర‌జ‌ల‌కు ఎటువంటి మేలు జ‌రిగిందో తెలియ‌చేయ‌లేద‌ని గుర్తుచేశారు. ఈ నోట్ల ర‌ద్దువ‌ల్ల అమ‌యాక ప్ర‌జ‌లు బ‌లైపోయారు త‌ప్ప ఇంకెవ్వ‌రు బ‌లైపోలేద‌ని అన్నారు..
 
దీనికి కారణమైన ప్రధాని మోడీని నడి రోడ్డు మీద కాల్చేయాల‌ని అన్నారు కత్తి మహేష్..  మోసాలు.. అబద్ధాలు.. ద్రోహాలకు చిరునామాగా మోడీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ప్రజల్ని రక్షించే రాజ్యాంగాన్ని ప్రజలే రక్షించాల్సిన అవసరం వచ్చిందన్న కత్తి.. సంఘ్ పరివార్... బీజేపీ మతోన్మాద శక్తులు రాజ్యాంగ రిజర్వేషన్లను తుంగలోకి తొక్కారన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.