మెగా హీరోలకి వార్నింగ్ ఇచ్చిన కత్తి మహేష్.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-06 14:55:57

మెగా హీరోలకి వార్నింగ్ ఇచ్చిన కత్తి మహేష్.

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కత్తి మహేష్ కి అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎలాంటి గొడవ జరుగుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన మహేష్ కత్తి ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో తిట్టారు. ఈ ఇన్సిడెంట్ తో మహేష్ కత్తి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు.

అయితే మళ్ళి చాలా కాలం తరువాత ఇటివలే శ్రీ రాముడి పై అలాగే సీతమ్మ వారి పై తీవ్ర విమర్శలు చేసి చిక్కుల్లో పడ్డాడు మహేశ్ కత్తి. ఈ విషయం పై మహేష్ కత్తిని పోలీసులు కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి మళ్ళి విచారించారు.

అయితే ఈ క్రమంలో మెగా బ్రదర్ అయిన నాగబాబు కూడా మహేష్ కత్తి పై విమర్శలు చేసాడు, నాగ బాబు చేసిన ఈ వాఖ్యలకి మహేష్ కత్తి స్పందిస్తూ మీ మెగా హీరోల సినిమా జీవితం, రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే చాలా ఉంది, ఎవరికీ తెలియదని అనుకుంటున్నారా..? మీ హద్దుల్లో మీరు ఉంటే మంచిది అంతేకాని అదుపు తప్పి విమర్శిస్తే సహించేది లేదు అంటూ నాగబాబు కి వార్నింగ్ ఇచ్చాడు మహేష్ కత్తి. మరి మహేష్ కత్తి చేసిన ఈ కామెంట్స్ పై నాగబాబు ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.