కత్తి మహేశ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-21 12:24:06

కత్తి మహేశ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో క‌త్తి మ‌హేశ్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తూ హ‌ల్ చ‌ల్ సృష్టిస్తున్నారు. అయితే ఈ వివాదానికి కార‌ణ‌మైన‌ క‌త్తి మ‌హేశ్ ఎవ‌రు... వీళ్ల కుటుంబ నేప‌ధ్యం ఏంటి.... అన్న‌ది  చాలా మందికి తెలియ‌దు. 

కత్తి మహేష్ రాయ‌ల‌సీమ ప్రాంతానికి సంబంధించిన వ్య‌క్తి. ఆయ‌న చిత్తూరు జిల్లా ఎల్లమంద గ్రామంలో జ‌న్మించారు. కత్తి మహేష్ త‌ల్లిదండ్రులు కత్తి సరోజమ్మ, కత్తి ఓబులేశు.  కత్తి మహేష్ త‌ల్లి ఏడాదిన్నర కిందట  క్యాన్స‌ర్ వ్యాధితో మరణించారు.తండ్రి ప్ర‌స్తుతం ఊళ్లోనే నివ‌సిస్తున్నారు. మహేష్‌ అన్న కత్తి రవికుమార్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిర ప‌డ్డారు. చెల్లెలు వాణిశ్రీ సికింద్రాబాద్ లో  న్యూట్రిషనిస్ట్‌గా చేస్తున్నారు. 

కత్తి మహేష్ భార్య సొనాలి..... సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా లక్‌నవ్‌లో ప‌ని చేస్తున్నారు. వీరిద్ద‌రూ ఇంట‌ర్ నెట్ ద్వారా ప‌రిచ‌యం అవ‌డంతో  ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్ల‌ది ఇంటర్నెట్‌ ప్రేమ. ఆమె స్వ‌స్థ‌లం కోల్‌కత్తా. వీళ్ల‌కు ఎనిమిది సంవ‌త్స‌రాల కుమారుడు ఉన్నాడు. కత్తి మహేష్ కొడుకు త‌ల్లి ప‌ర్యవేక్ష‌ణ‌లో ఉన్నాడు. మహేష్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌లో ఎంఏ పూర్తి చేసి....చిత్ర ప‌రిశ్ర‌మ‌లో  స్థిరపడ్డారు.

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.