రామ్ చరణ్ నాకు ఎటువంటి సలహాలు ఇవ్వలేదు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-13 12:33:49

రామ్ చరణ్ నాకు ఎటువంటి సలహాలు ఇవ్వలేదు

మెగా ఫ్యామిలీ నుంచి "విజేత" అంటూ మరో హీరో వచ్చేసాడు. మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు భర్త అయిన కళ్యాణ్ దేవ్ హీరో గా నటించిన "విజేత" సినిమా ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ రామ్ చరణ్ తనకి ఎలాంటి సలహాలు ఇవ్వలేదు అని చెప్పాడు.కేవలం ప్రమోషన్స్ విషయం లో మాత్రమే కొన్ని సలహాలు ఇచ్చాడు అని కళ్యాణ్ దేవ్ చెప్పుకొచ్చాడు.

అలాగే చిరంజీవి గురించి కూడా మాట్లాడుతూ, ఆయన సినిమా కథ నుంచి ఫైనల్ రషెస్ వరకు ఉన్నారని. కాని ఇంకా ఆయన మొత్తం సినిమా చూడలేదు అని త్వరలో ఆయని మొత్తం సినిమా చూపిస్తాము అని చెప్పాడు ఈ మెగా చిన్నల్లుడు.

ఇకపోతే తన భార్య శ్రీజ కి సినిమాలు అంటే అస్సలు ఇష్టం లేదని కేవలం వాళ్ళ ఫ్యామిలీ సినిమాలు మాత్రం చూస్తుంది అని అది కూడా అప్పుడప్పుడే మాత్రమే అని భార్య గురించి చెప్పాడు కళ్యాణ్ దేవ్. రాకేశ్ శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ పక్కా స్టార్ అవుతాడు అనే నమ్మకం మెగా అభిమానుల్లో ఉంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.