కీర‌వాణి పై కాపీ రైట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-30 06:17:46

కీర‌వాణి పై కాపీ రైట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అల‌నాటి చిత్రాల నుంచి ప్ర‌స్తుత సినిమాల వ‌ర‌కూ అనేక సినిమాల‌కు మ్యూజిక్ అందిస్తూనే ఉన్నారు ఎం.ఎం కీర‌వాణి... అయితే గ‌త మూడు సంవ‌త్స‌రాల క్రితం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం బాహుబ‌లి, బాహుబ‌లి2. ఈ రెండు సినిమాల‌కు కీర‌వాణి సంగీతం అందించారు... ఈ సినిమాకు అందించిన బాణీల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న మ్యూజిక్ తో అల‌రించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ క్ర‌మంలో బాహుబ‌లి సినిమాకు సంబంధించిన‌ ఓ కీల‌క స‌న్నివేశానికి అక్కినేని నాగేశ్వ‌ర రావు న‌టించిన కీలుగుర్రం చిత్రం నుంచి కీర‌వాణి మ్యూజిక్ ను కాపీ కొట్టార‌ట‌... కీలుగుర్రం సినిమాలో ఉన్న స‌న్నివేశాన్ని జ‌త‌ చేసి ఈ సినిమాలో ఉన్నటు వంటి సంగీతాన్ని కీర‌వాణి కాపీ కొట్టారంటూ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు నెటిజ‌న్లు..

ఈ వీడియోను కాస్తా నెటిజ‌న్లు షేర్ చేయ‌డంతో ప్ర‌స్తుతం సాంకేతిక‌ మాధ్య‌మాల‌లో వైర‌ల్ అవుతోంది.... అయితే ఈ విష‌యంపై కీర‌వాణి స్పందించారు... కీలుగుర్రం సినిమాలో ఉన్న మ్యూజిక్ ను కాపీ కొట్ట‌లేద‌ని, అది స్పూర్తి మాత్ర‌మేన‌ని కీర‌వాణి చెప్పుకొచ్చారు.. అయినా అత‌నిపై ఆరోప‌ణ‌లు మాత్రం ఆగ‌డంలేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.