“మహానటి” కి డిమాండ్ పెరిగిందా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

keerthi suresh
Updated:  2018-09-20 06:16:58

“మహానటి” కి డిమాండ్ పెరిగిందా..?

“నేనులోకల్”, “ఆజ్ఞతవాసి” లతో పరాజయాలు మూటగట్టుకున్నప్పటికీ “మహానటి” సంచలన విజయం తో తన సత్తా ఏంటో చూపింది కీర్తి సురేష్. ఆ చిత్రం తర్వాత కీర్తి సురేష్ కోసం దక్షిణాది నిర్మాతలు క్యూలో నిలబడ్డారు. ఇప్పుడు విక్రమ్ సరసన “సామి స్క్వేర్” చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధం అయ్యింది.

ఈ క్రమంలో శింబుతో మానాడు చిత్రంలో, శశికుమార్‌తో కొంబు వేచా సింగం అనే చిత్రంలో అవకాశాలు వచ్చాయి.అయితే ఇప్పుడు దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వినికిడి.  అయన రూపొందిస్తున్న పొలిటికల్ సెటైర్ మూవీ లో నటించటానికి కీర్తిని సంప్రదించారట . దీనికి ఆమె ఒప్పోకోవడంతో మిగతా కార్యక్రమాలు మొదలెట్టినట్టు తెలిసింది. కానీ ఏది కూడా అప్పుడే అధికారికంగా ప్రకటించకూడదని నిర్ణయించారట దర్శక నిర్మాతలు.

ఇక శశికుమార్‌తో ఎస్ఆర్ ప్రభాకరన్‌ నిర్మించే చిత్రం మీద పెద్దగా ఆసక్తి చూపియ్యడం లేదట కీర్తి సురేష్. కారణం అడగ్గా మంచి ప్రాజెక్టుల కోసం ఎదురుచూడటమే అని చెప్పుకొంటున్నారు. ఈమె తీరుతో సురేష్ తీరుతో ప్రభాకరన్, శశికుమార్ అసంతృప్తి గా ఉన్నారనిరి తెలిసింది. విక్రమ్ కలిసి నటించిన సామి స్క్వేర్ చిత్రం సెప్టెంబర్ 21న రిలీజ్ కానున్నది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.