ఆ బయోపిక్ లో నటించను అంటున్న కీర్తి సురేష్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

keerthi suresh
Updated:  2018-08-25 06:36:45

ఆ బయోపిక్ లో నటించను అంటున్న కీర్తి సురేష్

"మహానటి" సినిమాలో అలనాటి మేటి నటి అయిన సావిత్రి గారి పాత్రలో నటించి అందరి మెప్పు పొందింది కీర్తి సురేష్. ఈ సినిమా మంచి సక్సెస్ అయిన తరువాత కీర్తి సురేష్ కి తమిళ తెలుగు ఇండస్ట్రీస్ నుంచి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.

అలాగే తమిళ దివంగత మాజీ తమిళనాడు సి.ఏం అయిన జయలలిత బయోపిక్ లో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకోనున్నారు అని తెలిసింది. కానీ కీర్తి సురేష్ మాత్రం ఈ బయోపిక్ లో నటించే ప్రసక్తే లేదు అంటుంది. ఈ బయోపిక్ గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ "జయలలిత గారు గొప్ప నటి అంతకు మించి ఆమె ఒక గొప్ప నాయకురాలు.

అలాంటి ఆమె పాత్రలో నటించడం అనేది మామూలు విషయం కాదు. నేను ఆమె లాగ అస్సలు చెయ్యలేను, కనీసం ఆ పాత్రలో కూడా ఫిట్ కాను" అని చెప్పింది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళ్ లో "సామి 2" "పందెం కోడి 2" సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాని కూడా సైన్ చెయ్యలేదు కీర్తి సురేష్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.