“క్షణం” దర్శకుడికి సురేష్ బాబు ముప్పు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

khanam movie director
Updated:  2018-09-08 04:09:35

“క్షణం” దర్శకుడికి సురేష్ బాబు ముప్పు

ఒక్క సినిమాలో కనబడి మాయమయ్యే నటి నటులను మనం చూసే ఉంటాం. ఇదే కోవలోకి వచ్చిన దర్శకులు లేకపోలేదు. ఒకేఒక్క పరాజయం వల్ల దర్శకత్వం వదిలేసి సొంతగ్రామలకు వెళ్లిపోయునవారు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది దర్శకులు విజయం సాధించిన తరువాత కూడా తమని తాము కరెక్టు గా అమ్ముకోలేని పరిస్థితి లో ఉన్నారు.

రవికాంత్ పేరేపు అనే దర్శకుడు పెద్దగా తెలిసుండకపోవచ్చు కానీ ‘క్షణం’ దర్శకుడు అంటే వెంటనే ఓహ్ అతనా అనుకుంటాం. దానికి కారణం ఆ చిత్రం సాధించిన విజయం. మేజర్ క్రెడిట్ అడవి శేష్ కి వెళ్లినా దర్శకుడి కృషి లేకుండా ఆ చిత్రం అంత విజయం సాధించలేదు అనేది నగ్న సత్యం. ఇప్పుడు ఈ దర్శకుడు తనని తాను నిరూపించుకునే పనిలో పడ్డాడు. "క్షణం" తరువాత అతనికి సురేష్ ప్రొడక్షన్స్ నుండి పిలుపు అందింది. కోటి రూపాయలు లిమిట్ పెట్టి ఒక చిత్రం తియ్యమని అవకాశం వచ్చింది. దానిని పట్టాలెక్కించి దాదాపు పూర్తి చేశాడు.

ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఏంటంటే సురేష్ బాబుకి ఈ చిత్రం పెద్దగా అచ్చలేదంట! దాంతో ప్రస్తుతానికి దానిని పక్కన పెట్టాడు. ఈ సినిమా అనే కాదు అంతకు ముందు వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ కూడా మొదటిసారి నచ్చకపోవడంతో పలుమార్లు దానికి ఆపరేషన్ చేసి ప్రేక్షకుల మీదకు వదిలారు. కొద్దోగొప్పో విజయం సాధించినప్పటికి నిర్మాత అనుకున్నంత సొమ్ములు రాబట్టకపోవడంతో ఇకనైనా జాగ్రత పడదాం అనుకున్నాడు. కాబట్టి రవికాంత్ తీసిన చిత్రం కూడా అలానే అవుతుందేమో అని దానిమీద ప్రత్యేక శ్రద్ధ తీస్కుంటున్నట్లు వినికిడి. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.