తమిళ్ లో క్రేజీ ప్రాజెక్ట్ దక్కించుకున్న మహేష్ బాబు హీరోయిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu
Updated:  2018-08-07 11:14:27

తమిళ్ లో క్రేజీ ప్రాజెక్ట్ దక్కించుకున్న మహేష్ బాబు హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో "భరత్ అనే నేను" సినిమాలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది కైరా అద్వానీ. ఆ మూవీ హిట్ తో తెలుగు లో వరుస అవకాశాలు అందుకుంటుంది ఈ భామ. ఇప్పటికే బోయపాటి శ్రీను ఇంకా మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో మెయిన్ రోల్ లో నటిస్తుంది కైరా అద్వానీ. 
 
ఇదిలా ఉంటే ఇటివలే బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది ఈ భామ. అయితే ఇప్పుడు తమిళ్ లో కూడా తన జోరు చూపించేందుకు సిద్దం అవుతుంది కైరా అద్వానీ. తమిళ్ లో స్టార్ హీరో అయిన విజయ్ తన తదుపరి సినిమాని అట్లీ దర్శకత్వంలో చేస్తున్నాడు.
 
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి అవకాశం ఉండగా మెయిన్ హీరోయిన్ గా మాత్రం కైరా అద్వానీని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడు అంట డైరెక్టర్. ఒకవేళ కైరా గాని ఈ సినిమాకి సెలెక్ట్ అయితే ఇక సౌత్ లో కూడా తన జోరు చూపిస్తుంది అనమాట ఈ భామ.
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.