రివ్యూ రైటర్స్ కి వార్నింగ్ ఇచ్చిన కోన వెంకట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kona venkat
Updated:  2018-08-30 05:50:03

రివ్యూ రైటర్స్ కి వార్నింగ్ ఇచ్చిన కోన వెంకట్

ఒకప్పుడు "ఢీ" "రెడీ" "దూకుడు" లాంటి విజయవంతమైన కథలు అందించిన కథారచయిత కోన వెంకట్. విలన్ ని విలన్ ఇంట్లోనే హీరో ఆడుకునే కథలకు ఈయనే రిబ్బన్ కట్ చేశాడు. కొంతకాలం హిట్లు మీద హిట్లు కొట్టిన కోన వెంకట్ ఆ తర్వాత కొన్ని అదే తరహా కథలతో విసిగించాడు కూడా. ఆ తరువాత కాలానుగుణంగా మంచి కథలను రాస్తూ తనేమిటో నిరూపించుకుంటూ వస్తున్నాడు ఈ రచయిత. కొంత కాలం హారర్ స్టొరీల మీద పడ్డాడు. ఇప్పుడు తాజాగా థ్రిల్లర్ స్టోరీస్ ని రాస్తున్నాడు.

మొన్న రిలీజ్ అయిన “నీవెవరో” చిత్రం బాగానే ఉన్నా కొంత మంది కావాలనే నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ వాపోయాడు. కోట్లు పెట్టి తీసిన సినిమా ని పది రూపాయలు పెట్టి కొన్న పెన్నుతో ఎస్టిమేట్ చెయ్యొద్దు అని చెప్పుకొచ్చాడు ఈ నిర్మాతగా మారిన రచయిత. మూస కథలను రాస్తున్నాను అన్నారనే "గీతాంజలి" "నీవెవరో" లాంటి కథలను రాస్తున్నాను.

ఇప్పుడు ఇవి ఆదరించాలని లేని పక్షంలో మళ్ళీ కమర్షియల్ కథలనే రాస్తాను అని ఒక హెచ్చరిక లాంటిది జారీ చేశారు. ఏది ఏమైనా కోట్లు పెట్టి తీసిన సినిమా బాగుండాలని లేదు అలా అని పది రూపాయల పెన్నుకు ఆ సినిమా గురించి రాసే అర్హత ఉండకూడదు అని లేదు. ఎవరి అభిప్రాయాన్ని వారు వ్యక్తపరచడం లో తప్పేముంది అంటున్నారు సినీప్రేమికులు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.