కౌశల్ ఆర్మీ ని చూస్తుంటే అందరికి మైండ్ పోతుంది

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

koushal
Updated:  2018-09-10 04:58:40

కౌశల్ ఆర్మీ ని చూస్తుంటే అందరికి మైండ్ పోతుంది

బిగ్ బాస్ 2 హౌస్ లో ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అంటే అందరూ కౌశల్ అనే చెప్తారు. ఎందుకంటే ఆటని ఆటగా ఆది ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు కౌశల్. అయితే కౌశల్ ఆర్మీ నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన 2కే రన్ ప్రభంజనం సృష్టించడంతో అందరూ షాక్ అవుతున్నారు.

బిగ్ బాస్ చరిత్రలోనే ఇటువంటి సంఘటన జరగలేదు దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోతున్నారట. కౌశల్ డబ్బులు ఇచ్చి అభిమానుల్ని తెచ్చుకుంటున్నాడు అని అన్న వారంతా ఈ ర్యాలి ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కౌశల్ ఆర్మీ పద్దతి చూస్తుంటే బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ అని చాలా మందికి అర్ధం అవుతుంది. ఒకవేళ కౌశల్ కు కాకుండా మరొకరిని ఎంపిక చేస్తే సహించేలా లేరు ఈ ఆర్మీ వాళ్ళు.

అంతటి తీవ్ర ప్రభావం చూపిస్తున్నారు కౌశల్ ఆర్మీ. బిగ్ బాస్ నిర్వాహకులతో పాటుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిని సైతం ప్రభావితం చేసేలా ఆర్మీ ప్లాన్స్ ఉంటున్నాయి అంటే ఏ స్థాయిలో కౌశల్ ఆర్మీ పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. మరి మున్ముందు కౌశల్ ఆర్మీ ఇంకెన్ని ర్యాలిలు చేపడతారో చూడాలి.

 

షేర్ :