కౌశల్ ఆర్మీ చేతిలో పడ్డ గీత మాధురి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

koushal and geetha
Updated:  2018-09-06 11:27:27

కౌశల్ ఆర్మీ చేతిలో పడ్డ గీత మాధురి

‘కౌశల్ ఆర్మీ’ బిగ్ బాస్-2 చూసేవాళ్లకు ఈ పేరుకు తెలియాయకుండా ఉండదంటే అతిశయోక్తి లేదు. దాదాపు కౌశల్ ఏ టైటిల్ విన్నర్ అని ప్రేక్షకులు ఖరారు అయిపోయారంటే దానికి కారణం ఈ ఆర్మీనే. వీళ్ళతో వచ్చిన చిక్కేమిట్రా అంటే మిగతా కాంటెస్టెంట్స్ ని వీళ్ళు ట్రోల్స్ చెయ్యడం మొదలెడితే సోషల్ మిడియా మొత్తం ట్రోల్స్ చేసేందుకు రెడి అయిపోద్ది.

ఇప్పుడిదే జరుగుతుంది. తాజాగా బిగ్ బాస్ ఇంట్లో ఐటమ్ సాంగ్స్ కి నర్తించమని ఆదేశాలు వచ్చాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాటకి కి డాన్సులు వేశారు. ఆలాగే కౌశల్ కూడా.గీతా మాధురి ‘జిగేల్ రాణి’ పాటకు డాన్స్ వెయ్యగా కౌశల్ తోబా తోబా అంటూ కాలు కదిపాడు. మనోడు గురించి తెలిసిందేగా ఏదో అంతంత మాత్రంగానే వేశాడు. దీనితో నిద్ర లేచిన గీత గారి ఫ్యాన్స్ కౌశల్ ని చిన్న మాట అన్నట్టున్నారు.

అంతే కౌశల్ ఆర్మీ మొత్తం గీతని టార్గెట్ చేశారు.  పూజ హెడ్గే ఈ డాన్స్ చూస్తే ఖచ్చితంగా సచ్చిపొద్దని కొందరు, హౌస్ లో అద్దాలు పెట్టారా? అని ఇంకొందరు వెక్కిరిస్తున్నారు. కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్లి ప్రపంచపు అతి చెత్త డాన్సర్ అని బిరుదు కూడా ప్రదానం చేసేసారు. ఆమె కేవలం టైం పాస్ చేయడానికే వచ్చిందని ఇంకొందరు తమ అసంతృప్తిని బయట పెట్టారు. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.