మంచు హీరోని టార్గెట్ చేసిన కౌశల్ ఆర్మీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

manchu manoj and koushal army
Updated:  2018-09-28 12:56:34

మంచు హీరోని టార్గెట్ చేసిన కౌశల్ ఆర్మీ

అక్కినేని నాగార్జున, నాచురల్ స్టార్ నాని మల్టి స్టార్రర్ “దేవదాసు” నిన్న రిలీజ్ అయ్యి అన్నిచోట్లా నుండి మిక్సెడ్ టాక్ సంపాదించుకుంది. ఈ చిత్ర విడుదలకు ముందు కొందరు సెలెబ్రిటీలు తమ తమ విషెష్ ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. మంచు మనోజ్ కూడా టీం “దేవదాసు” కి అల్ ది బెస్ట్ చెప్తూ ఒక ట్వీట్ పెట్టాడు.

Super excited to watch an absolute thrilling combo of Dev and Das!Two of the most beautiful actors on a Single screen is a treat...Best wishes to @iamnagarjuna garu Who gets younger by the day :)@NameisNani Babai & the entire team of #DevaDas for the release today!” 

అయితే ఎవరు నాని గురించి ప్రస్తావించినా, ఎవరు బిగ్ బాస్ గురించి మాట్లాడినా తగుదునమ్మా అంటూ వచ్చేస్తున్నారు ఈ కౌశల్ ఆర్మీ.  తాజాగా మనోజ్ పెట్టిన ట్వీట్ కి కూడా రిప్లై ఇస్తూ. నానికి సపోర్ట్ చెయ్యొద్దు అంటూ బెదిరించే ప్రయత్నం చేసారు. కానీ మనోజ్ మాత్రం చాలా కూల్ గా వారికి సమాధానం ఇచ్చాడు. సినిమా అనేది ఏ ఒక్కరివల్లో నిలబడిపోదని, ఒక సినిమా వాళ్ళ వందల మంది అన్నం తింటున్నారని అలంటి సినిమాని ఒక వ్యక్తి వాల్ల నాశనం చెయ్యడం సబబు కాదని ప్రశాంతంగా చెప్పుకొచ్చాడు.

అయితే అప్పటికి మాట వినని ఈ ఆర్మీ నాని బిహేవియర్ బాగోలేదని అతను కౌశల్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక వీరితో మాటలనవసరం అనుకున్న మనోజ్ ఎమోజిలతో రిప్లై ఇచ్చాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.