పెయిడ్ ఆర్మీ అని ప్రూవ్ చేస్తే టైటిల్, ప్రైజ్ మనీ వెనక్కి ఇచ్చేస్తా..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

koushal
Updated:  2018-10-05 10:57:50

పెయిడ్ ఆర్మీ అని ప్రూవ్ చేస్తే టైటిల్, ప్రైజ్ మనీ వెనక్కి ఇచ్చేస్తా..

బిగ్ బాస్ షో అయిపోయి వారం అవుతున్నా, ఇంకా షో పేరిట వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఈ సీజన్ కి కౌశల్ విన్నర్ అయ్యింది అందరికి తెలిసిందే. అయితే తాను విజేత అవ్వడం లో ముఖ్యపాత్ర పోషించింది మాత్రం "కౌశల్ ఆర్మీ''. కౌశల్ అభిమానులు అందరూ కలిసి ఏర్పరచుకున్న ఈ ఆర్మీ షో టైంలో కౌశల్ ని ఇబ్బంది పెడితే హోస్ట్ గా వ్యవహరించిన హీరో నాని నే ముప్పుతిప్పలు పెట్టారు.. అలాంటిది ఈ ఆర్మీ పై మొదటినుండి కూడా ఒక విమర్శ బలం గా వినిపిస్తుంది.

అదేంటంటే ఈ ఆర్మీ పెయిడ్-ఆర్మీ అని, డబ్బులు తీసుకుంటూ కౌశల్ కి పబ్లిసిటీ కల్పిస్తున్నారని. ఓట్లు కూడా డబ్బు వెచ్చించి సంపాదించినవే అని రకరకాల అభియోగాలు ఉన్నాయి.. షో తరువాత విరివిగా అభిమానుల్ని కలుస్తున్న కౌశల్, ఈ వ్యాఖ్యల  పై, విమర్శల పై స్పందించాడు. ఈ ఆరోపణలను నిరూపిస్తే - తాను ఫ్రాడ్ చేసి గెలిచినట్లుగా నిరూపిస్తే తన టైటిల్ ను మరియు ప్రైజ్ మనీని వారికి ఇచ్చేస్తాను అంటూ సవాల్ విసిరాడు.. కౌశల్ మాత్రం ఈ విషయం లో  సీరియస్ గానే ఉన్నట్టు కనిపిస్తున్నాడు.

తన ఆర్మీ గురించి విమర్శలు చేస్తే, అది ఎవరైనా కానీ ఎంత దూరం వెళ్లేందుకు అయినా తాను సిద్దం అని అందరి ముందు చెప్పాడు కౌశల్. ఈ ఆర్మీ అనుకున్నట్లుగా షో నడిచింది అని సోషల్ మీడియాలో కూడా టాక్ వినిపిస్తుంది. ఇంత పవర్ ఫుల్ ఆర్మీని పెయిడ్ ఆర్మీ అంటూ, ఎలా విమర్శలు చేస్తారు అంటూ కౌశల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక బాబు గోగినేని ఈ విషయమై, తన మాటలతో ఈ వివాదాన్ని కొనసాగిస్తున్నాడు.. బాబు గోగినేని కి ఏ రేంజ్ సమాధానం చెప్తారో కౌశల్ ఆర్మీ చూడాలి మరి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.