కౌశల్ బిగ్ బాస్ షో ఎంట్రీ వెనుక ఉన్న టాలీవుడ్ అగ్ర హీరో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

koushal
Updated:  2018-10-03 12:56:14

కౌశల్ బిగ్ బాస్ షో ఎంట్రీ వెనుక ఉన్న టాలీవుడ్ అగ్ర హీరో

బిగ్ బాస్ ముగిసి నాలుగు రోజులు అవుతున్నా ఇంకా అంత అదే ఫీవర్ లో ఉన్నారు.. బిగ్ బాస్ విన్నర్ అయిన కౌశల్ ఫాన్స్ ని కలవడం, ఇంటర్వ్యూ లు ఇవ్వడం లో బిజీ అయిపోయాడు. అలా ఒక ఇంటర్వ్యూలో తను బిగ్ బాస్ షో కి వెళ్లడం వెనుక ఉన్న టాలీవుడ్ అగ్ర హీరో ఎవరు అనేది ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. కౌశల్, రాజకుమారుడు సినిమాలో మహేష్ తో కలిసి నటించాడు. ఆ సినిమా చేసేటప్పుడు మహేష్ తనని మోడలింగ్ అకాడమీ పెట్టేలా ప్రోత్సహించారని, లేకపోతే ఇప్పుడు మీ ముందు ఇలా ఉండేవాడిని కాదు అని చెప్పుకొచ్చాడు కౌశల్.

ఆ రోజుల్లో మహేష్, డైరెక్టర్ రాఘవేంద్రరావు చాలా సహాయం చేసారు లేదంటే అన్ని సర్దుకొని వైజాగ్ తిరిగి వెళ్లిపోయేవాడ్ని అని కౌశల్ చెప్పారు. ఇక పోతే తన పేరున అభిమానులు కౌశల్ ఆర్మీ ఏర్పాటు చెయ్యడం ఆనందదాయకం అని, దాన్ని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తా అని అన్నాడు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.