"సై రా" కోసం క్రిష్ సలహాలు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sai ra and krish
Updated:  2018-08-29 04:03:35

"సై రా" కోసం క్రిష్ సలహాలు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక 151వచిత్రం “సైరా” చిత్రం నిర్మాణ దశలోనే ఉంది కానీ అంచనాలు మాత్రం ఆకాశాన్ని దాటేస్తున్నాయి. మొన్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈచిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి కొణిదల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తుండగా "కిక్" "ఊసరవెల్లి" "ధ్రువ" లాంటి విజయవంతమైన చిత్రలకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. 

అయితే తాజాగా ఈ చిత్రానికి మరో దర్శకుడి సాయం అవసరం అయ్యింది అని సినీవర్గాల సమాచారం. "గమ్యం" "కంచె" "వేదం" "గౌతమీపుత్ర శాతకర్ణి" లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడి సాయాన్ని సురేందర్ రెడ్డి తీసుకుంటున్నాడంటా. ఈ సినిమా కి సంబంధించిన చిత్రీకరణ జార్జియా లో జరుగుతుంది. క్రిష్ కూడా తన "గౌతమీ పుత్ర శాతకర్ణి" షూటింగ్ కూడా అక్కడే జరిగింది. 

ఈ ప్రాంతం లో తీయాల్సిన పోరాటసన్నివేశాల కోసం సురేంద్ రెడ్డి క్రిష్ దగ్గర కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నాడు. క్రిష్ కూడా తనకి తోచిన సలహాలను ఇచ్చాడంటా. దీంతో ఈ చిత్రం ఎలా రూపుదిద్దుకుంటుందో అని అటు మెగా ఫాన్స్ లోను ఇటు సినిమా లవర్స్ లోను ఆశక్తి నెలకొంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.