ప్రభాస్ పెళ్లి విషయం లో సీరియస్ గా ఉన్న కృష్ణం రాజు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-23 18:39:25

ప్రభాస్ పెళ్లి విషయం లో సీరియస్ గా ఉన్న కృష్ణం రాజు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో హీరోల పెళ్లి అనే టాపిక్ ఎత్తగానే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఎందుకంటే ప్రభాస్ ఏజ్ దాదాపు 40 దగ్గరకి వచ్చినా కూడా ఇప్పటి వరకు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇంతకుముందు "బాహుబలి" పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటా అని ప్రభాస్ అనేవాడని. కానీ ఇప్పుడు "సాహో"లో బిజీ అయిపోయాడని. అదయ్యాక చూద్దాం అంటున్నాడని కృష్ణం రాజు చెప్పాడు.
 
అయితే "సాహో" సినిమా పూర్తయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ పెళ్లి చేసేయాలని కృష్ణం రాజు కుటుంబం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ విషయం గురించి కృష్ణంరాజు కూడా ప్రభాస్ దగ్గర సీరియస్ గానే మాట్లాడాడు అంట. ఇక ఇప్పుడు ఫ్యామిలీ మెంబెర్స్ ప్రభాస్ కోసం సంబంధాలు కొంచెం గట్టిగానే చూస్తున్నారు. ఇప్పటికే అమ్మాయి ఖరారైందని కూడా వార్తలొస్తున్నాయి.
 
ఇక ప్రభాస్ విషయానికొస్తే "సాహో" అయ్యేంత వరకు ప్రభాస్ అసలు ఎవరు కనిపించడు అని అర్ధం అవుతుంది. కానీ ఎక్కడ కనిపించినా కూడా అందరూ ప్రభాస్ పెళ్లి విషయం అడిగి ప్రభాస్ ని దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు. అయితే తాను పెళ్లి చేసుకోబోతుంటే మాత్రం అందరికీ ఆ విషయాన్ని చెబుతానని ప్రభాస్ ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేసాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.