డిఎస్పికి కేటిఆర్ మెస్సేజ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ktr dsp image
Updated:  2018-03-31 16:44:59

డిఎస్పికి కేటిఆర్ మెస్సేజ్

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్న‌ సంగీత ద‌ర్శ‌కుల్లో దేవి శ్రీ ప్రసాద్ అంటే తెలియ‌ని వారెవ‌రు ఉండ‌రు. దేవి శ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో అందరూ రాక్ స్టార్ గా పిలుస్తారు. తెలుగులో ఘ‌న విజ‌యం సాధించిన ఎన్నో చిత్రాల‌కు సంగీతం అందించారు డిఎస్పి. తెలుగు రాష్ట్రాల్లో దేవికి ఒ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. సంగీతం ఇవ్వ‌డంలో దేవికి ఎవ్వ‌రు సాటిలేర‌ని అంటారు.  కథకు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడం డిఎస్పి కి వెన్నతో పెట్టిన విద్య అని చెప్ప‌వ‌చ్చు.
 
తాజాగా రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన రంగస్థలం సినిమా 1985 మంచి స‌క్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాకోసం 80 ఏళ్ల నాటి క్లారినెట్ అనబడే ఒక ఇన్స్ట్రుమెంట్ ను వెలికి తీసి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు దేవి.  రంగమ్మా మంగమ్మా పాట అయినా జిగేలు రాణి పాట అయినా ఇప్పుడు యువతను ఒక ఊపు ఊపుతున్నాయి అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.... ఆ పాటలకు ప్రేక్షకులే కాదు సెలెబ్రెటీలు సైతం ఫిదా అవుతున్నారట.
 
ఈ పాట‌ల‌కు గులాం అయిన ప్ర‌ముఖులు స్వయంగా తనకు కాల్స్ మెస్సేజెస్ పెడుతున్నారని చెప్పారు దేవిశ్రీ ప్ర‌సాద్‌.  రంగస్థలం సినిమాకి నేనిచ్చిన ఫోక్ మ్యూజిక్ చాలా బావుంద‌ని అల్లు అర్జున్ కాల్ చేసి చెప్పిన‌ట్లు దేవి తెలిపారు. అదే విధంగా కేటీఆర్ కూడా స్వయంగా మెస్సేజ్ చేసి మెచ్చుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  కేటీఆర్ మెచ్చుకోవ‌డం చాలా ఆనందం కలిగించింద‌ని అన్నారు.  హీరో సూర్య కూడా బాష రాకపోయినా పాటలు బావున్నాయి అని చెప్పిన‌ట్లు ప్రేక్షకులతో పంచుకున్నారు దేవిశ్రీ. 
 
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.