కోర్టులో విడాకుల కోసం అప్లై చేసిన ఐశ్వర్యారాయ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bollywood
Updated:  2018-11-05 05:25:09

కోర్టులో విడాకుల కోసం అప్లై చేసిన ఐశ్వర్యారాయ్

టైటిల్ చూడగానే ఒకింత ఆశ్చర్యం, మరికొంత షాక్ కలిగిందా? అయితే కంగారు పడొద్దు. మీరు అనుకున్న ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ అయితే కాదు. అయితే ఇందులో న్యూస్ ఏముంది అనుకుంటున్నారా? ఈ ఐశ్వర్య కూడా కొంచెం సెలెబ్రిటీ ఏ.. అదెలా అంటారా..? మీకు లాలూ ప్రసాద్ యాదవ్ తెలుసా..? అతని కోడలు పేరు కూడా ఐశ్వర్య రాయ్ ఏ... ఇక్కడ వచ్చింది అసలు కన్ఫ్యూజన్. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కి ఆరు నెలల క్రితమే ఐశ్వర్యారాయ్ తో పెళ్లి అయ్యింది.

ఢిల్లీ కల్చర్ కి అలవాటు పడిన ఐశ్వర్య, బీహారీ కల్చర్ కి తలొగ్గలేక పోయింది. అందుకే కొట్టుకుని పరువు తీసుకోవడం కన్నా  ఇద్దరి ఏకాభిప్రాయం మీద విడిపోవడం మంచిది అని నిశ్చయించుకొన్నారట.అసలు ఐశ్వర్య రాయ్ తో పెళ్లి వద్దని చాలా సార్లు చెప్పాడట ! కానీ లాలూ కానీ రబ్రీ దేవి కానీ, కొడుకు మాట వినకుండా బలవంతంగా పెళ్లి కుదిర్చి, తాళి కట్టించారట, దాంతో పెళ్లి అయిన ఆరునెలలకె ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.

బీహార్ లో ఉండే తేజ్ కి, ఢిల్లీ లో పెరిగిన ఐశ్వర్య కి జీవన విధానాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయట. దాంతో మనోడితో ఐశ్వర్య రాయ్ సర్దుకోలేక విడాకుల కోసం కోర్టు ని ఆశ్రయించారట ఈ జంట. బలవంతంగా పెళ్లి చేసారు అందుకే విడాకులు తీసుకుంటున్నాను అంటూ మీడియా ముందుకు వచ్చి చెబుతున్నాడు తేజ్ ప్రతాప్ యాదవ్.

షేర్ :