లావ‌ణ్య త్రిపాఠి అరెస్ట్ చేయాలంటూ ట్వీట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-26 11:30:57

లావ‌ణ్య త్రిపాఠి అరెస్ట్ చేయాలంటూ ట్వీట్

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అందాల రాక్షసి సినిమాతో ప‌రిచ‌య‌మై, అగ్ర హీరోల సినిమాల‌ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టిస్తోంది లావ‌ణ్య త్రిపాఠి... అయితే ఈ అందాల రాక్ష‌సి... సోగ్గాడే చిన్ని నాయ‌నా, భ‌లే భ‌లే మ‌గాడివోయ, మిస్ట‌ర్ వంటి చిత్రాల‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

తాజాగా ఈ అందాల భామ న‌టించిన చిత్రం ఇంటిలిజెంట్... ఈ సినిమాను ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా త‌న అభిమానులు క‌నురెప్ప మూయ‌లేని విధంగా, ప‌సుపు రంగు గౌనులో ఫోటో దిగింది లావ‌ణ్య... అయితే ఈ ఫోటోను త్రిపాఠి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

లావ‌ణ్య త్రిపాఠి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వ‌రుణ్ అనే నెటిజ‌న్ ఈ ఫోటోను ట్యాగ్ చేస్తూ... అందంగా ఉండ‌డం నేర‌మైతే వెంట‌నే లావ‌ణ్య త్రిపాఠిని అరెస్ట్ చేయాల‌ని, త‌న అందంతో యువ‌కుల‌ను చంపేస్తోంద‌ని ట్వీట్ చేశాడు... దీనికి లావ‌ణ్య రీ ట్విట్ చేస్తూ .. హా...హా...హా... మా నాన్న లాయ‌ర్ అంటూ ఆ యువ‌కుడికి రిప్లై ఇచ్చింది.. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.