"గీత గోవిదం" ని మిస్ చేసుకొని పెద్ద తప్పు చేసిన ఆ హీరోయిన్ ఎవరు ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

geetha govindam
Updated:  2018-08-21 12:51:19

"గీత గోవిదం" ని మిస్ చేసుకొని పెద్ద తప్పు చేసిన ఆ హీరోయిన్ ఎవరు ?

"అందాల రాక్షసి" అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచమైన మోడల్ లావణ్య త్రిపాటి. ఈ సినిమా తరువాత లావణ్య త్రిపాటికి ఏ సినిమా కూడా మంచి పేరుని తీసుకొని రాలేదు. అయితే ఈ భామ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలని మిస్ చేసుకొని తన కెరీర్ ని చిక్కుల్లో పడేసుకుంది.

వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన "తొలిప్రేమ" సినిమాలో మొదట లావణ్య నే అనుకున్నారు అంట. కానీ అంతకుముందే "మిస్టర్" సినిమాలో వరుణ్ తో చేయడం డేట్స్ సమస్య రావడంతో "తొలిప్రేమ" ని వదులుకుంది కట్ చేస్తే "తొలిప్రేమ" మంచి హిట్ అయ్యింది, ఇక "శ్రీరస్తు శుభమస్తు" వంటి హిట్ తర్వాత విజయ్ దేవరకొండ తో పరశురామ్ తీసే "గీత గోవిందం" చిత్రంలో కూడా లావణ్య ని అనుకున్నారు, అప్పటికే విజయ్ ఇంకా లావణ్య త్రిపాటి మీద ఫోటో షూట్ కూడా చేశారట.

అయితే కాస్త రొమాన్స్ ఎక్కువగా ఉందనో లేకపోతె వేరే ఇతర కారణాల వల్లనో "గీత గోవిందం" సినిమాని రిజెక్ట్ చేసింది ఈ భామ. ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. ప్రస్తుతానికి లావణ్య కి తెలుగు లో ఒక్క సినిమా కూడా లేదు పాపం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.