ఓ కుటుంబాన్ని ఆదుకున్న హీరో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-08 04:50:01

ఓ కుటుంబాన్ని ఆదుకున్న హీరో

ఇచ్చిన మాట‌కు ఋణ‌ప‌డి ఉండేవారు దేశంలో చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు... అందులో రాజ‌కీయ నాయ‌కుల గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు... ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు అదిచేస్తాం... ఇది చేస్తాం అంటూ ప్ర‌చారం చేసి చివ‌రికి ఫ‌లితాలు విడుద‌ల అయ్యాక, ఒక్క‌టి కూడా నేర‌వేర్చ‌రు... ఇది ఆన‌వాయితీగా  వ‌స్తున్న సంప్ర‌దాయమ‌ని చెప్పుకోవ‌చ్చు...అయితే ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి ఏమీ ఆశించ‌కుండా వారి అభిమానాన్ని మాత్ర‌మే ఆశిస్తారు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీ, న‌టులు.
 
వారి సినిమా విడుద‌ల రోజున అభిమానికి ఏమైనా జ‌రిగితే వెంట‌నే వ‌చ్చి త‌మ అభిమానిని ప‌రామ‌ర్శించి వారి కుటుంబానికి ఆర్థిక స‌హాయాన్ని అందిస్తారు... అలా ఆర్థిక స‌హాయాన్ని అందించిన వారిలో ప‌ది మంది హీరోల‌కు గాను ఆరుగురు హీరోలు ఆర్థిక స‌హాయాన్ని అందిస్తారు.
 
అయితే గ‌తంలో త‌మిళ‌నాడు జ‌ల్లి క‌ట్టు ఉద్య‌మంలో మ‌ర‌ణించిన ఓ బాలుడి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లిన హీరో లారెన్స్ వారికి ఇళ్లు క‌ట్టిస్తాన‌ని మాట ఇచ్చారు... ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి ఒక స్థ‌లాన్ని తానే స్వ‌యంగా కొని సుమారు 22 ల‌క్ష‌ల‌తో ఇళ్లు క‌ట్టించారు లారెన్స్ ...  సుమారు 22 లక్షలతో నిర్మించిన ఇంటి తాళాలను లారెన్స్‌ మృతుడు యోగేశ్వరన్‌ కుటుంబసభ్యులకు అప్పగించారు.  ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలతో మానవత్వాన్ని చాటుకుంటున్న లారెన్స్ ఈ నిర్ణయంతో అభిమానుల మనసును మరోసారి గెలుచుకున్నారు...కాగా తాను  చేసింది సాయం కాదు, ఇది నా బాధ్యత అని లారెన్స్ చెప్పారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.