యూ - టర్న్ తీసుకున్న మా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

maa association respond sri reddy issue
Updated:  2018-04-13 12:30:18

యూ - టర్న్ తీసుకున్న మా

గత రెండు నెలల నుంచి సంచలన కామెంట్స్ తో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలనే కాదు , దేశం మొత్తాన్ని తన వైపుకి తిప్పుకుంది శ్రీ రెడ్డి...మొన్న ఫిలిం ఛాంబర్ దగ్గర అర్థ నగ్న ప్రదర్శనతో నిరసన తెలపడంతో తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు, దేశం మొత్తం అవాక్కయింది...దీంతో శ్రీ రెడ్డి చేసిన నిరసనను తప్పుపడుతూ మా ప్రెస్ మీట్ పెట్టి శ్రీ రెడ్డి ని తెలుగు చిత్ర పరిశ్రమ నుండి బహిష్కరిస్తున్నాం. తనకు మా సభ్యత్వం ఇవ్వడం కుదరదు..మా సభ్యులతో కలిసి నటించడానికి కుదరదని తేల్చి చెప్పారు.
 
రెండు రోజులలోనే శ్రీ రెడ్డికి భ‌యపడి మా ప్లేట్ ఫిరాయించింది...శ్రీ రెడ్డికి మా సభ్యతం ఇస్తాం...ఆమె ఎవరితోనైనా నటించవచ్చు..ఆమె పైన ఉన్న బహిష్కరణను ఎత్తివేస్తున్నాం అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు...అప్పట్లో ఆవేశంతో ఆ నిర్ణ‌యం తీసుకున్నాం...ఎవరైనా తప్పు చేయవచ్చు, ఇలా చేసిన ఒక్క తప్పుతోనే బహిష్కరించడం తప్పు అని పెద్దలు చెప్పడంతో బహిష్కరణను ఎత్తి వేస్తున్నాం అని మా చెప్పింది.
 
శ్రీ రెడ్డి ఇప్పటికే మరో ఇద్దరి పేర్లు ఆధారాలతో సహా బయటపెడతా అని చెప్పడంతో మా వెనక్కి తగ్గింది అంటున్నారు...కానీ శ్రీ రెడ్డి కి మద్దతు తెలుపుతున్న వారు మాత్రం...శ్రీ రెడ్డి ఎవరి బండారం బయట పెడుతుందో అని భయపడి పెద్దలే మా తో  వెనకడుగు వేయించారని అంటున్నారు...మరి ఏమో చూడాలి మా వెన‌క్కి తగ్గినట్టు శ్రీ రెడ్డి కూడా వెన‌క్కి తగ్గుతుందా లేదా చెప్పినట్లుగానే వారి పేర్లు బయటపెడుతుందా అని.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.