పవన్ కళ్యాణ్ మీద కుల ముద్ర వెయ్యడానికి ప్రయత్నిస్తున్న జర్నలిస్టు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

pawan kalyan
Updated:  2018-09-18 10:50:13

పవన్ కళ్యాణ్ మీద కుల ముద్ర వెయ్యడానికి ప్రయత్నిస్తున్న జర్నలిస్టు

జనసేన అధినేత మరియు ఇతర పార్టీ పెద్దలంతా కలిసి మొన్నొక ప్రవైట్ మీటింగ్ పెట్టుకున్న సంగతి అందరికీ విదితమే. ఆ మీటింగ్ కి పర్మిషన్ లేకుండా వెళ్లడమే కాకుండా ఆ మీటింగ్ మీద కుల ముద్ర వెయ్యడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలం అయ్యాడొక ప్రబుద్దుడు. 
 
అతనెవరో కాదు మహా టీవీ వార్త ఛానల్ ప్రధాన కార్యదర్శి మూర్తి. అతను చేసిన పనికి అతన్ని ఉద్యోగం నుండి ఊడపీకింది సదరు న్యూస్ ఛానల్ యాజమాన్యం. ఆ తరవాత అతని మీద సామజిక మాధ్యమాలలో పవన్ అభిమానులు రాజకీయ విశ్లేషకులు అతన్ని అతను చేసిన పనికి తప్పు బడుతూ ఆయన్ని ఒక ఆట ఆడుకున్నారు.
 
ఇదిలా ఉండాగా “నేను చేసింది ముమ్మాటికీ కరెక్ట్” అంటూ మళ్ళి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తన మొండితనాన్ని మరోసారి వ్యక్త పరిచాడు. జనసేన పార్టీ కాపు కులస్తుల కోసమే పెట్టినట్లు ఉందని, అలాగే జనసేన కోసం డబ్బులు తీసుకుంటున్నాడని పార్టీ ఫండ్ తీసుకోవాలి అందులో తప్పులేదు కానీ అది చెక్ ల రూపంలో ఉండాలి కానీ నగదు రూపంలో కాదని కానీ నాకళ్ల ముందే పవన్ కళ్యాణ్ నగదు తీసుకున్నాడని ఈ వీడియో లో చెప్పుకొచ్చాడు.
 
కులాలను కలిపే ఆలోచన ఉందన్న పవన్ కళ్యాణ్ ఒక్క కాపు కులస్తులనే ఎందుకు ఈ మీటింగ్ కి ఆహ్వానించాడు అంటూ ఆయన మీద కుల ముద్ర వెయ్యడానికి ప్రయత్నించాడు. ఇక ఇప్పుడేమో మరో ఛానల్ లో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ పై పవన్ కళ్యాణ్ పై మూర్తి చేస్తున్న ఆరోపణల వల్ల ఆ పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లే ప్రమాదము లేకపోలేదు. అస్సలే మొన్న ఇండియా టుడే నిర్వహించిన ఒక సర్వేలో జనసేన ప్రాభల్యం ఆంధ్ర లో పెద్దగా ఉండదని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు ఈ మూర్తి  పనివల్ల జనసేన కి నష్టం జరిగే సూచనలు కనబడుతున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.