మహానటి మహా ఖర్చు అంటున్న నిర్మాత

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahanati
Updated:  2018-09-20 01:19:52

మహానటి మహా ఖర్చు అంటున్న నిర్మాత

ఇండస్ట్రీ లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే అనుకున్నంత బడ్జెట్ లో పూర్తి అవుతాయి. చాలా మటుకు చిత్రాలు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవుతాయి. కొన్ని సినిమాలు డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా తిరిగి లాభాలను చేకూరుస్తాయి మరికొన్ని నష్టాల్లో ముంచేస్తాయి.  మంచి పేరు తీసుకొచ్చి ముంచేసిన పర్లేదు అనుకునే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉన్నారు మన ఇండస్ట్రీ లో అలాంటివారిలో ముందుండే వారు వైజయంతి మూవీస్ అశ్వనీదత్ గారు. 
 
నాగ అశ్విన్ దర్శకత్వం లో సావిత్రమ్మ గారి జీవితాన్ని “మహానటి” చిత్రం ద్వారా తెరెకెక్కించారు. అయితే ఈ చిత్రానికి తొలుత అనుకున్న బడ్జెట్ వేరు, నిర్మాణం లోకి దిగిన తర్వాత అయిన ఖర్చు వేరని ఈ మధ్య అయన వెల్లడించారు.  ముందుగా అనుకున్న బడ్జెట్ ప్రకారం ఈ సినిమా 16 నుండి 17 కోట్ల మధ్య అయిపోతుంది అని అశ్వనిదత్ మ్మాయి స్వప్న ఫైనలైజ్ చేసిందట. 
 
అసలు మహానటికి ఆ బడ్జెట్ ఎక్కువని దత్ గారు అనుకున్నారట. ఆ బడ్జెట్ ఎక్కువని అనుకున్నప్పటికీ సావిత్రి గారి సినిమా కాబట్టి సెట్స్, గ్రాఫిక్స్ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించామని చెప్పారట. ఫైనల్ గా ఖర్చు చూస్తే 29 కోట్లు అయిందట.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.