అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో మహేష్ బాబు.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-02 01:07:39

అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో మహేష్ బాబు.

అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమా తీసి ఏకంగా స్టార్ డైరెక్టర్ లిస్టులోకి వెళ్ళిపోయాడు సందీప్ రెడ్డి. ఈ సినిమా తరువాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇప్పటికే మహేష్ బాబు కోసం ఒక ఖతర్నాక్ కథని సందీప్ రెడ్డి రెడీ చేసినట్టు తెలుస్తుంది.
 
కానీ అదే టైంలో సందీప్ రెడ్డికి హిందీ లో అర్జున్ రెడ్డి రీమేక్ ని తెరకెక్కించే అవకాశం వచ్చింది. ఈ హిందీ రీమేక్ లో షహీద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ హిందీ అర్జున్ రెడ్డి వచ్చే ఏడాది జూన్ 21 న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత మహేష్ బాబుతో సినిమాని స్టార్ట్ చేస్తాడు సందీప్ రెడ్డి. 
 
వచ్చే ఏడాది జూలై లేదా ఆగష్టు నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం మహేశ్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు మహేష్ బాబు. ఈ రెండు సినిమాల తరువాతే సందీప్ రెడ్డి సినిమా సెట్స్ లో జాయిన్ అవుతాడు మహేష్ బాబు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.