త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా ఇక లేనట్టేనా?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu and trivikram
Updated:  2018-08-09 02:43:04

త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా ఇక లేనట్టేనా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు "అతడు" ఇంకా "ఖలేజా". ఈ రెండు సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అయితే ఇప్పుడు మళ్ళి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే గత ఏడాది వరకు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవుతుంది అని అనుకున్నారు అంతా.
 
కానీ ఒకవైపు మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్ తో తప్ప ఇతర దర్శకులతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అలాగే త్రివిక్రమ్ కూడా ఇతర హీరోలతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25 వ సినిమా చేసున్నాడు దాని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా "అర్జున్ రెడ్డి" దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమాని చేయడానికి రెడీ అవుతున్నాడు.
 
దీన్ని బట్టి చూస్తుంటే మహేష్ బాబు మరో రెండేళ్ళ వరకు ఖాలిగా లేడు అని అర్ధం అవుతుంది. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం మాత్రం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.