ఆ కమెడియన్ పనిపట్టిన మహేష్ ఫాన్స్.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-15 05:12:43

ఆ కమెడియన్ పనిపట్టిన మహేష్ ఫాన్స్.

ఎదుటివారిని వేలెత్తి చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు మనతప్పుల్ని చూపిస్తాయి అనేది నానుడి.  మనోజ్ ప్రభాకరన్ అనే స్టాండప్ కమెడియన్ చేసిన వ్యాఖ్యలు ఇలానే ఉన్నాయి. తాజాగా అతడు సూపర్ స్టార్ మహేష్ బాబు పై వివాదాస్పదంగా కామెంట్స్ చేసాడు.
 
స్పైడర్ చిత్రం గురించి మాట్లాడుతూ ఎస్ జె సూర్య మహేష్ బాబు కన్నా బాగా నటించాడంటూ, మహేష్ కి నటన అంటే ఏంటో తెలియదు అంటూ, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కి మహేష్ బాబు మేల్ వెర్షన్ అంటూ తన వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేపాడు. దాంతో సామజిక మాధ్యమాలలో మహేష్ బాబు ఫాన్స్ అతగాడి మీద విరుచుకుపడ్డాడు. 
 
దీంతో మనోజ్ సోషల్ మీడియా పేజెస్ అన్ని నెగటివ్ కామెంట్స్ తో నిండిపోయాయి. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి డైరెక్ట్ గా కూడా ఫోన్ లు చేసి మనోజ్ ను దూషిస్తున్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తప్పు తెలుసుకున్న సదరు కమెడియన్ మహేష్ బాబు ఫాన్స్ ని క్షమాపణ కోరుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసాడు. అంతే కాదు ఒరిజినల్ వీడియోని తన ఛానల్ నుండి తొలగించాడు కూడా. తాను కావాలని ఆలా మాట్లాడలేదని, హాస్యం పుట్టించడం కోసం ఏవేవో చేస్తూ చాల మందిని టార్గెట్ చేస్తూ ఉంటాం అంటూ చెప్పుకొచ్చాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.