మళ్ళి సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న మహేష్ బాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu
Updated:  2018-08-14 03:30:05

మళ్ళి సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. "మహర్షి" అనే టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా యొక్క టిజర్ ని ఇటివలే మహేష్ బాబు పుట్టిన రోజు సంధర్బంగా రిలీజ్ చేసారు మూవీ యూనిట్. అయితే ఈ సినిమా పూర్తిగా తండ్రి కొడుకుల మధ్య సాగే తెరకెక్కుతుంది అంట. ఇందులో రిషి మహేష్ బాబు అయితే మహర్షి అనేడి మహేష్ బాబు తండ్రి అనే టాక్ ఫిలిం నగర్ లో ఉంది.
 
మహేష్ బాబు గత సినిమాలు అయిన "భరత్ అనే నేను" ఇంకా "శ్రీమంతుడు" సినిమాల్లో తండ్రి సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అందుకే ఈ సారి కూడా కథలో తండ్రి సెంటిమెంట్ ఉండేలాగా చూసుకున్నారు అంట మూవీ యూనిట్.
 
ఇదిలా ఉంటే వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ఇంకా అశ్విని దత్ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు.