ఎన్టీఆర్ బయోపిక్ లో మ‌హేష్ బాబు..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu and balakrishna
Updated:  2018-11-05 05:55:49

ఎన్టీఆర్ బయోపిక్ లో మ‌హేష్ బాబు..?

నందమూరి తారకరామారావు ఈ పేరు ఒక ప్రభంజనం అని వేరే చెప్పనక్కర్లేదు.ఆయన జీవిత చరిత్ర ని ఆయన కుమారుడు బాలకృష్ణ హీరో గా క్రిష్ జాగర్లమూడి తెరకి ఎక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ ఎన్టీఆర్ చిన్న నాటి నుండి సినీ ప్రస్థానం వరకు కథ నాయకుడు గా, రెండోవ భాగం లో రాజకీయ ప్రవేశం నుండి రాజకీయాల్లో ప్రస్థానం వరకు మహనాయకుడు పేరున తెరకెక్కనున్నాయి.

అయితే సినీ ప్రస్థానంలో ఎన్టీఆర్ తో పాటు ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ కూడా వీరితో పోటీగా ఉండేవారు. కృష్ణ కి, ఎన్టీఆర్ కి ఒకరకంగా పెద్ద పోటీ ఏ ఉండేది. అయితే ఎన్టీఆర్ బయో పిక్ లో కృష్ణ పాత్రకి గాను, సూపర్ స్టార్ మహేష్ బాబు ని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆ పాత్ర చేయాలంటూ స్వయంగా బాలకృష్ణ ఏ మహీష్ కి ఫోన్ చేశారట. మహేష్ బాబు కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తూ, సమయం చూసుకొని చెప్తాను అన్నారట.ఈ పాత్రని నువ్వే చెయ్యాలి అని మహేష్ ని బాలయ్య కోరినట్టు సమాచారం.

ఒకవేళ సూపర్ స్టార్ ఒప్పుకుంటే సినిమా మరో రేంజ్ కి వెళ్లే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే దింట్లో చంద్రబాబు గా రానా దగ్గుబాటి నట్టిస్తున్న విషయం తెలిసిందే. జనాదరణ కోసం అందర్నీ ఆకట్టుకోవడానికి బాలయ్య తీసుకున్న స్టెప్ సముచితమే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

షేర్ :