సితారాని గారాబం చేస్తున్న మహేష్ బాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu
Updated:  2018-08-17 12:09:14

సితారాని గారాబం చేస్తున్న మహేష్ బాబు

మహేష్ బాబు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయిన కూడా ఇప్పటికి పిల్లలతో ఎటువంటి స్టార్ స్టేటస్ లేకుండా టైం ని గడుపుతూ ఉంటాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాగాని ఫ్యామిలీ కి సమయం కేటాయిస్తూ వాళ్ళని అప్పుడప్పుడు టూర్స్ కి తీసుకొని వెళ్తాడు మహేష్ బాబు.
 
అయితే ఇటివలే తన పుట్టిన రోజు సంధర్బంగా ఫ్యామిలీ ని తీసుకొని గోవా కి వెళ్ళాడు మహేష్ బాబు. అయితే అక్కడ మహేష్ బాబు పిల్లని చాలా గారాబం చేసాడు అంట. తన పిల్లలు అయిన గౌతమ్ ఇంకా సితారలను మహేష్ బాబు ఎంత గారాబంగా పెంచుతాడో అని నమ్రత గతంలో ఎన్నోసార్లు చెప్పింది.
 
తాజాగా పిల్లలు ఇద్దరు ఏదో కావలి అని అడిగితె నమ్రత దానికి నో చెప్పింది అంట, కానీ వాళ్ళు మాత్రం వారి కోరికను తీర్చుకునేందుకు తండ్రి వద్ద పంచాయితీ పెట్టారని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌ లో ఒక పోస్ట్ పెట్టింది నమ్రత శిరోద్కర్. ఇదిలా ఉంటే మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా "మహర్షి". ఈ సినిమా యొక్క టిజర్ ఇటివలే రిలీజ్ అయింది.

షేర్ :