రకుల్ కి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న మహేష్ బాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh and rakul preet singh
Updated:  2018-07-19 03:27:02

రకుల్ కి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25 వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు మహేష్ బాబు. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "1 నేనొక్కడినే" ఫ్లాప్ అయిన గాని మంచి సినిమాగా నిలిచింది.

ఆ సినిమా ఫ్లాప్ అయిన గాని సుకుమార్ మీద నమ్మకం తో అలాగే "రంగస్థలం" లోని ఎమోషన్స్ నచ్చి సుకుమార్ కి మరొక ఛాన్స్ ఇచ్చాడు మహేష్ బాబు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు అట.

"స్పైడర్" సినిమా ఫ్లాప్ అయ్యాక మహేష్ బాబు రకుల్ కి మాట ఇచ్చాడు అట తన తదుపరి సినిమాలో అవకాశం ఇస్తాను అని. కానీ వంశీ పైడిపల్లి సినిమాలో అనుకోకుండా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సో ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం రకుల్ ని హీరోయిన్ గా సెట్ చేసి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు అట మహేష్ బాబు. సుకుమార్ తో "రంగస్థలం" సినిమాని ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ ఏ ఈ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేయనున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.