మ‌హేష్ రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించేశార‌ట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero mahesh babu
Updated:  2018-06-27 13:51:25

మ‌హేష్ రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించేశార‌ట

మ‌హేష్ బాబు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వ‌చ్చిన హీరోలా ఉంటాడు.. కాని అచ్చ‌మైన బాలీవుడ్ న‌టుడు.. అందానికి హ్యాండ్ స‌మ్ లుక్స్ కి కృష్ణ వార‌సుడు అనిపించుకున్నాడు..ఇక తీసిన సినిమాలు హిట్ అయితేనే త‌న అభిమానులు చూస్తారు, వ‌న్స్ త‌న  సినిమా అభిమానుల‌కు న‌చ్చ‌క‌పోతే వారే చూడ‌రు అని బోల్డ్ గా, త‌న అభిమానుల ముందే చెప్పిన ఓ స‌రైన హీరో ప్రిన్స్ మ‌హేష్ బాబు.
 
ఇటు మ‌హేష్ ఇప్పుడు తాజాగా త‌న సినిమా కెరియ‌ర్లో 25 వ చిత్రంలో న‌టిస్తున్నారు.. అయితే ఈ సినిమాకు ఇద్ద‌రు బ‌డా తెలుగు నిర్మాత‌లు రెడీ అయ్యారు.. ఇక ఒక‌రు వైజ‌యంతి పిక్చ‌ర్స్  అధినేత అశ్వ‌నీద‌త్, అయితే మ‌రొక‌రు స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్  దిల్ రాజు.. అయితు బ్ర‌హ్మోత్స‌వం ప్లాప్ నుంచి  మ‌హేష్ బాబు  బ‌య‌ట‌ప‌డినా, ఆ స‌మ‌యంలో నిర్మాత పీవీపీకి ఇచ్చిన మాట నుంచి మాత్రం బ‌య‌ట‌ప‌డ‌టం లేదు... త‌న‌కు సినిమా చేస్తాను అని మాట ఇచ్చిన మ‌హేష్ బాబు, ఇప్పుడు  అశ్వ‌నీద‌త్ - దిల్ రాజుతో క‌లిసి  సినిమా చేస్తున్నాడు అని ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు పీవీపీ.
 
ఇక చేసేది లేక మ‌హేష్ మాట‌తో పివీపి ని కూడా నిర్మాత‌గా చేర్చుకున్నారు దిల్ రాజు అశ్వ‌నీద‌త్.. అయితే సినిమా పై మంచి లాభాలు వ‌స్తాయి అని అనుకున్న చిత్ర నిర్మాత‌ల‌కు ఇలా మూడ‌వ వ్య‌క్తి లాభాల్లో చేర‌డంతో వారి ఇద్ద‌రికి కూడా మ‌రో ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట మ‌హేష్..త‌న రెమ్యూన‌రేష‌న్ లో 25 శాతం క‌ట్ చేయ‌మ‌ని చెప్పాడ‌ట మ‌హేష్.. మొత్తానికి ఈ డీల్ ని మ‌హేష్ బాబు కుదిర్చాడు అని అంటున్నారు చిత్ర యూనిట్..
 
మ‌రి ఈ డీల్ లో ముందు మ‌హేష్ మొత్తం రెమ్యూన‌రేష‌న్ తీసుకుందాం అని భావించినా, ఈ బ‌డ్జెట్ మ‌రింత పెరిగి ఇబ్బంది అవుతుంది అని త‌న‌కు తానుగా రెమ్యున‌రేష‌న్ లో కోత విధించుకున్నాడ‌ట..మొత్తానికి ఆ నాడు సూప‌ర్ స్టార్ కృష్ణ కూడా నిర్మాత‌ల‌కు లాస్ వ‌స్తే అస‌లు డ‌బ్బులు తీసుకునే వారు కాదు, ఇప్పుడు మ‌హేష్ కూడా తండ్రి బాట‌లో వెళుతున్నారు అని అంటున్నారు ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.