రాఖీ పండగకి సూపర్ మెసేజ్ ఇచ్చిన మహేష్ బాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu
Updated:  2018-08-11 03:18:32

రాఖీ పండగకి సూపర్ మెసేజ్ ఇచ్చిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ ఇటివలే తన పుట్టిన రోజు వేడుకల్ని ఫ్యామిలీ తో అలాగే "మహర్షి" టీం తో కలిసి గోవా లో జరుపుకున్నాడు. అదే రోజు "మహర్షి" సినిమా టిజర్ ని కూడా రిలీజ్ చేసారు మూవీ యూనిట్. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న రిలీజ్ కానుంది. ఇంతటి ఆనంద సమయంలో ఆయన ఒక సామాజిక ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.
 
అదేంటంటే వచ్చే రాఖీ పండగకి అందరూ అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకి హెల్మెట్ ని బహుమతిగా ఇవ్వండి అని చెప్పారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు అని అందుకే తమ అన్నదమ్ములకి హెల్మెట్ ఇచ్చి తమ కుటుంబాలని కాపాడుకోండి అంటూ జనం కి ఒక మంచి మెసేజ్ ని ఇచ్చాడు మహేశ్ బాబు.
 
అసలైతే ఈ ఆలోచన ఎం.పి కవితది కాని మహేష్ కి ఆలోచన నచ్చి తన వంతు సాయంగా ఈ ఆలోచనని ప్రోమోట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఎంత మంచి అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకి హెల్మెట్ ఇస్తారో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు